గల్లా అశోక్, నిధి అగర్వాల్ రొమాన్స్.. జానీ మాస్టర్ స్టెప్పులతో రచ్చ
గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా వస్తోన్న ఈ మూవీ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం సాంగ్ షూటింగ్‌లో ఉండగా.. ఆ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ మేరకు జానీ మాస్టర్ షేర్ చేసిన ఫోటోలు, సెట్స్‌కు సంబంధించిన స్టిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అసలే ఇప్పుడు జానీ మాస్టర్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు.
బుట్టబొమ్మ లాంటి బ్లాక్ బస్టర్‌కు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు గల్లా అశోక్ సినిమాకు స్టైలీష్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడు. ఈ మేరకు జానీ మాస్టర్ పోస్ట్ చేస్తూ.. హీరో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ సినిమా సాంగ్ షూటింగ్ పూర్తయిందని చెప్పుకొచ్చాడు. అదిరిపోయే గ్రేస్ ఉందంటూ హీరోపై ప్రశంసలు కురిపించాడు. నిధి అగర్వాల్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని చెప్పుకొచ్చాడు.
కమిట్‌మెంట్ మూవీ స్టిల్స్ : అన్వేషి జైన్, తేజస్వీ మడివాడ హాట్ గ్యాలరీ (ఫొటోలు)

ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని తెలిసిందే. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్ ఇవ్వగా రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేసిన సంగతి తెలిసిందే. ముహూర్తపు సన్నివేశానికి సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











