బ్రేకింగ్: జానీ మాస్టర్‌కు బెయిల్.. కానీ ట్విస్టు ఏమిటంటే?
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ లభించింది. గత కొద్ది రోజులుగా చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది. ఆయన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ తనను మైనర్ బాలికగా ఉండగా ముంబైలోని ఓ హోటల్‌లో అత్యాచారం చేశారనే ఆరోపణలపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఈ కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు. దాంతో జానీ మాస్టర్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అయితే ఈ కేసులో రాజేంద్రనగర్ కోర్టులో విచారణ సందర్భంగా జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. పోలీస్ కస్టడీలో విచారణ అనంతరం రెండు రోజుల క్రితం మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, రంగారెడ్డి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయనకు ఈ కేసులో కొంత ఊరట లభించింది.

అయితే తన భర్త జానీ మాస్టర్ నిర్దోషి. ఈ కేసులో ఆయనను కుట్రపూరితంగా ఇరికించారు. మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని భార్య ఆయేషా రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
కోర్టు పేర్కొన్న షరతలు ప్రకారం.. జానీ మాస్టర్‌కు అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత బెయిల్‌ను పొడిగిస్తారా? లేదా అనేది కోర్టు పరిధిలో ఉందనే విషయం తెలిసింది. అయితే వ్యక్తిగత పూచికత్తు, పాస్ పోర్టును కోర్టుకు అందజేయాలని కోర్టు ఆదేశించిందని తెలిసింది. దాంతో ఆయన అక్టోబర్ 6వ తేదీన బెయిల్‌పై రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











