జానీ మాస్టర్‌కు ఊరట.. రేప్ కేసులో అరెస్ట్‌ చేయం.. నార్సింగి పోలీసుల క్లారిటీ

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్ లైంగిక దాడి కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. గత కొన్ని నెలలుగా తనపై అత్యాచార యత్రం, దాడి, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో జానీ మాస్టర్‌కు ఊరట లభించే అవకాశం ఏర్పడింది. ఆ వివరాల్లోకి వెళితే..

జానీ మాస్టర్ తనను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆయన భార్య కూడా నాపై దాడి చేసింది. నా ఫ్లాట్‌కు వచ్చి నాపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే తమ పరిధిలో కేసు లేకపోవడంతో జానీ మాస్టర్ నివాసం ఉండే నార్సింగి ప్రాంతానికి కేసు నమోదు చేశారు.

Jani Master gets relief in Rape Case by Assistant Choreographer

అయితే ఈ కేసు విషయమై నార్సింగి పోలీసు ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ.. జానీ మాస్టర్‌పై అతడి అసిస్టెంట్ కేసు నమోదు చేసింది. రాయదుర్గం నుంచి కేసు మాకు ట్రాన్స్‌ఫర్ అయింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసులో విచారణ అనంతరం.. బాధితురాలిని కలిసి మాట్లాడిన తర్వాత అన్ని విషయాలు పరిశీలించి కేసు విషయంలో ముందుకు వెళ్తాం అని అన్నారు.

అయితే బాధితురాలు ఇంకా పోలీస్ స్టేషన్‌కు వచ్చి కలువలేదు. మేము బాధితురాలితో మాట్లాడాం. ఆమె హైదరాబాద్‌లో లేదని చెప్పారు. వేరే టూరులో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఆమె నుంచి వాగ్మూలం తీసుకొంటాం. అనంతరం విచారణపై తగు నిర్ణయం తీసుకొంటాం అని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.

ఇదిలా ఉండగా, జీరో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం వల్ల జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయలేం. ఒకసారి బాధితురాలిని నుంచి స్టేట్‌మెంట్ తీసుకొన్న తర్వాత గానీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. ఆ తర్వాత అవసరం అయితే అరెస్ట్ చేస్తాం. అప్పటి వరకు జానీ మాస్టర్‌ను ఎలాంటి విచారణకు పిలువమని చెప్పారు.

ఇక జానీ మాస్టర్, తన అసిస్టెంట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వారిద్దరూ ఆరేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. ఆమెను యధా రాజా తథా ప్రజా మూవీలో హీరోయిన్‌గా కూడా చేశారు. అయితే వారిద్దరి మధ్య విభేదాల కారణంగా విడిపోయారు. ఈ మధ్యలో గొడవలు ముదరడంతో జానీ మాస్టర్‌పై బాధితురాలు కేసు నమోదు చేసింది.

More from Filmibeat

Read more about: jani master rape case tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X