బన్నీ అరెస్ట్ పై జానీ మాస్టర్ కామెంట్స్ వైరల్.. ఆ ఇద్దరే ముందు గుర్తొచ్చారు

ఇటీవల కొన్ని రోజులు నుంచి తెలుగు సినిమా దగ్గర ఓ రేంజ్ లో హైలైట్ అయ్యిన పలు షాకింగ్ కాంట్రవర్సీలలో టాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవెల్లో బిగ్ స్టార్ అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై వచ్చిన ఇష్యూ కూడా ఒకటని చెప్పాలి. కాగా తన బిగ్గెస్ట్ సినిమా పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు అల్లు అర్జున్ ని ఊహించని పరిస్థితుల్లోకి నెట్టేశాయి.

దీనితో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా టాపిక్ అయ్యిపోయాడు. ఇక్కడ నుంచి అల్లు అర్జున్ లైఫ్ తారు మారు అవ్వడం తాను జైల్లోకి వెళ్లడం కూడా షాకింగ్ గా మారింది. ఇక ఈ అరెస్ట్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో అది సంచలన వార్తగా కూడా మారిపోయింది. అక్కడ నుంచి అల్లు అర్జున్ కి సంబంధించి ఏదొక వార్త వైరల్ అవుతూనే వస్తుండగా తన అరెస్ట్ ముందుకి అయితే మరో టాలీవుడ్ ప్రముఖుడు జానీ మాస్టర్ అరెస్ట్ కావడం తెలిసిందే.

jani master key comments on allu arjun arrest

అయితే తన కేసు వేరు కానీ తాను కూడా జైలు నుంచి ఎట్టకేలకి బయటకి వచ్చాడు. బయటకి వచ్చిన తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం పాజిటివ్ గా మాట్లాడిన తాను అల్లు అర్జున్ విషయంలో మాత్రం మాటలు దాటవేయడం మరిన్ని ప్రశ్నలకి దారి తీసింది. కాగా దీనికి కారణం అల్లు అర్జున్ కూడా తన అరెస్ట్ లో పరోక్షంగా ఉన్నాడు అనే రూమర్స్ నిజమే అన్నట్టుగా కూడా టాక్ వినిపించింది.

కాగా ఆ కొన్ని రోజులు దాటవేసిన జానీ మాస్టర్ ఇపుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించడం వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కోసం తనకి తెలిసినప్పుడు మొట్ట మొదటిగా అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ లు మాత్రమే మొదట గుర్తుకొచ్చారు అని తెలిపారు. తన సాంగ్స్ షూటింగ్ టైం లో ఇద్దరు స్పాట్ లోకి వచ్చి ఎంతో అల్లరి చేసేవారు.

jani master key comments on allu arjun arrest

మరి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత వారి పరిస్థితి ఏంటా అని వాళ్ళే టక్కున గుర్తొచ్చారు అంటూ జానీ మాస్టర్ కీలక కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే జైలు లైఫ్ మాత్రం ఎవరూ అనుభవించకూడదు అని అది చాలా దారుణం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి వారు తన అరెస్ట్ లో ఎందుకు స్పందించలేదు అనే దానిపై కూడా తాను మాట్లాడారు.

వాళ్ళు నా కోసం మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా నేను వారి కోసం ఖచ్చితంగా చివరి వరకు నిలబడతాను అని వారి మీద అభిమానం ఎప్పటికీ పోదు అంటూ కీలక కామెంట్స్ చేశారు. దీంతో ఈ సెన్సిటివ్ అంశాల్లో జానీ మాస్టర్ మాటలు ఇపుడు ఆసక్తి రేపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X