జానీ మాస్టర్ లేకపోతే చచ్చిపోతా..బాధితురాలు అలా బ్లాక్ మెయిల్..భార్య సంచలన ఆరోపణలు
మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులు, మత మార్పిడి (లవ్ జిహద్) విషయాలపై ఆయన భార్య సంచలన విషయాలను బయటపెట్టింది. తన భర్త ఎన్నడూ ఎవరిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. మత మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోవాలని వేధించారని బాధితురాలు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ వివాదంపై జానీ మాస్టర్ భార్య మీడియాతో మాట్లాడుతూ..
లవ్ జిహాద్ ఆరోపణలు తప్పు. మాస్టర్ ముస్లిం కావడంతో ఆ పాయింట్‌ను ఆసరగా చేసుకొని కొందరు కుట్ర పూరితంగా కేసు పెట్టారు. మాస్టర్ ముస్లిం కావడంపై అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను హిందువును. నేను బుర్ఖా కూడా ధరిస్తాను. అత్త వాళ్లింట్లో నన్ను అయేషా అంటారు. మా ఇంట్లో సుమలత అని పిలుస్తారు. జానీ మాస్టర్‌కు ఎలాంటి పట్టింపులు లేవు అని అన్నారు.

కేవలం ఆయన కెరీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతో కొందరు ప్రయత్నిస్తున్నారు. అంతేకానీ ఆయన ఎన్నడూ కూడా మతం మార్చుకోమని చెప్పరు. మాది లవ్ మ్యారేజ్. నా పేరు సుమలత. నేను మతం, పేరు మార్చుకోలేదు. నా పాస్ పోర్ట్, అన్ని డాక్యుమెంట్లు సుమలతగానే ఉంటాయి అని అన్నారు.
నేను వస్తాను. మీతోనే ఉంటాను అని వెంటపడింది. నేను చెప్పుతో కొట్టానని అంటే నిజమే. నేను అన్నం తింటుంటే వస్తే ఓ ముద్ద పెడుతాను. కానీ నా జీవితాన్నే లాగేసుకోవడానికి వస్తే నేను ఊరుకుంటానా? అని జానీ మాస్టర్ భార్య సుమలత అన్నారు
జానీ మాస్టర్‌తో 16 ఏళ్ల నుంచి ట్రావెల్ అవుతున్నది. ఏనాడు కూడా ఆమెను వేధించలేదు. ఆమెకు సపోర్ట్ చేసి అవకాశాలు ఇప్పించారు. ఏనాడు బలవంతం చేయలేదు. నాపై కూడా కేసు పెట్టింది. నేను కూడా ఎన్నడూ వేధించలేదు.
జానీ మాస్టర్‌ను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టింది. ఆయన లేకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అయితే నా తల్లిదండ్రులు రకరకాలు టార్చర్‌కు గురి చేశారని ఏడ్చింది. నన్ను అలాంటి బట్టలు వేసుకోమని బలవంతం చేస్తున్నారు.నన్ను మా అమ్మ అనుమానిస్తున్నది. మీరు నాకు సపోర్ట్‌గా ఉండండి. నన్ను పెళ్లి చేసుకోండి అని వెంటాపడ్డారని జానీ మాస్టర్ భార్య మీడియాకు వెల్లడించింది.


Click it and Unblock the Notifications











