Jani Master: మాధవీలతపై భగ్గుమన్న జానీ మాస్టర్ భార్య.. నీకేం తెలుసు? రుజువులు ఉన్నాయా? అంటూ ఫైర్
లైంగిక వేధింపుల కేసు, మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయనను 14 రోజుల రిమాండ్ తరలించారు. తాజాగా ఆ రిమాండ్‌ను మరోసారి అంటే అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో మాధవీలత గురించి జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ..
జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన లేడీ కొరియోగ్రాఫర్‌కు నటి మాధవీలత సపోర్టుగా నిలిచారు. లేడీ కొరియోగ్రాఫర్‌కు అన్యాయం జరిగింది. ఈ విషయంలో సాక్షాలు రుజువైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. పుష్ప ఈవెంట్‌లో 300 మంది ముందే అమ్మాయిని కొట్టాడని తెలిసింది అంటూ మాధవీ లత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారని మీడియా అడిగిన ప్రశ్నపై జానీ మాస్టర్ భార్య స్పందించారు.

జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్‌కు ఎలాంటి గొడవ జరగలేదు. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయలేదు. అసలు ఏ విషయం మాధవీలతకు తెలియదు. ఏమీ తెలియకుండానే మాధవీ లత రకరకాల కామెంట్స్ చేసింది. ఒకవేళ పుష్ప 2 షూటింగులో నిజంగా 300 మంది కొడితే.. సాక్షం చూపించమనండి. ప్రొడక్షన్ యూనిట్ ఉంటుంది కదా? అని జానీ మాస్టర్ భార్య ఘాటుగా స్పందించారు.
ఇక విశ్వక్ సేన్ సినిమా షూటింగులో కూడా ఆ అమ్మాయిని జానీ మాస్టర్ కొట్టాడనే విషయంపై మాధవీలత చెప్పిన మాటలను ఆమె ఖండించింది. విశ్వక్ సేన్‌కు నచ్చకపోవడం వల్లే ఆమెను ఆ సినిమా నుంచి తొలగించారు. ఆమెతో జానీ మాస్టర్ మిస్ బిహేవ్ చేశారనే అంటే మాధవీలత రుజువు చూపించాలి. ఇలాంటి అవాస్తవాలను ఆధారంగా చేసుకొని సపోర్టు చేయకూడదు అని జానీ మాస్టర్ భార్య అన్నారు.
నేను కూడా ఫిలిం ఛాంబర్‌లో లేడీ కొరియోగ్రాఫర్‌పై కేసు నమోదు చేశాను. దానిపై ఎందుకు ఎవరు స్పందించడం లేదు. నేను కూడా బాధితురాలినే కదా? నేను కొట్టారని ఆరోపణలు చేసినప్పుడు ఆ రుజువులు కూడా చూపించాలి కదా. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదు అని జానీ మాస్టర్ భార్య చెప్పారు.
ఇక జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. ఈ కేసులో ఆయన రావడం కాస్త లేటు కావొచ్చేమో.. కానీ నిజాయితీపరుడిగా ఆయన విడుదల అవుతారు. మా వద్ద చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వాటిని సరైన సమయంలో కోర్టులో చూపిస్తాం. ఈ కేసులో జరుగుతున్న కుట్రను బయటపెడుతాం అని జానీ మాస్టర్ భార్య అన్నారు.


Click it and Unblock the Notifications











