జనతా కర్ఫ్యూ.. కుటుంబ సమేతంగా కరతాళధ్వనులు.. అల్లు, మంచు ఫ్యామిలీ వీడియోలు వైరల్
దేశ ప్రధాని నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను దేశం అంతా పాటిస్తోంది. కర్ఫ్యూలో భాగంగా ఐదు గంటలకు బాల్కనీలోకి వచ్చి కరతాళధ్వనులు చేయాలని, గంటలు కొట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. భయంకరమైన కరోనా వైరస్‌ను ఎదుర్కొంటూ వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు గుర్తుగా కరతాళధ్వనులు చేశారు. టాలీవుడ్ ప్రముఖులందరూ బయటకు వచ్చి గంటలు, కరతాళధ్వనులు కొట్టారు.

జనతా కర్ఫ్యూ..
కరోనా ఒకరిని నుంచి మరొకరికి సోకుతుండటంతో ఈ గొలుసును అరికట్టేందుకు పద్నాలుగు గంటలపాట స్వీయ నిర్భందం విధించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చాడు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలే కావడంతో.. పద్నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉంటే.. కరోనాను నియంత్రించే అవకాశం ఉందని దేశ ప్రజలకు సూచించాడు.
ఐదుగంటలకు బాల్కనీలో..
అదే విధంగా మనకు సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని స్మరించుకుని, గౌరవించుకునే క్రమంలో అందరూ ఐదు గంటలకు కరతాళ ధ్వనులు చేయాలని ప్రధాని కోరాడు. ఈ క్రమంలో టాలీవుడ్ మొత్తం కదిలింది. కుటంబసమేతంగా కరతాళ ధ్వనులు చేసి వారి సేవలను గుర్తించారు.
మంచు ఫ్యామిలీ..
క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే మోహన్ బాబు..మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాడు. కుటుంబం, తన సిబ్బంది అందిరి చేత చప్పట్లు కొట్టించి, జై హింద్ అనే నినాదాలు చేయించాడు. ఈ వీడియోలో మొత్తం మంచు ఫ్యామిలీ పాల్గొంది.
Recommended Video

ప్రత్యేకంగా నిలిచిన అల్లు ఫ్యామిలీ..
అల్లు ఫ్యామిలీ అన్నింటిలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ మధ్య అల్లు ఫ్యామిలీ పేరు తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కరోనా సమయంలోనూ తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తున్న వారిని గౌరవించారు. కుటుంబ సమేతంగా బయటకు వచ్చి కరతాళధ్వనులు చేశారు. ఈ వీడియోలో అల్లు అయాన్, అల్లు అర్హ హైలెట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











