జనతా కర్ఫ్యూ.. మెగా ఫ్యామిలీ కరతాళధ్వనులు.. ఎంకరేంజ్ చేస్తూ ఫుల్ జోష్‌లో మెగాస్టార్
దేశ ప్రధాని నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ, కరతాళ ధ్వనులు అనే కార్యక్రమం విజయవంతమైంది. కర్ఫ్యూలో భాగంగా ఐదు గంటలకు బాల్కనీలోకి వచ్చి కరతాళధ్వనులు చేయాలని, గంటలు కొట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. భయంకరమైన కరోనా వైరస్‌ను ఎదుర్కొంటూ వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు గుర్తుగా కరతాళధ్వనులు చేశారు. టాలీవుడ్ ప్రముఖులందరూ బయటకు వచ్చి గంటలు, కరతాళధ్వనులు కొట్టారు.

జనతా కర్ఫ్యూ..
కరోనా ఒకరిని నుంచి మరొకరికి సోకుతుండటంతో ఈ గొలుసును అరికట్టేందుకు పద్నాలుగు గంటలపాట స్వీయ నిర్భందం విధించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చాడు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలే కావడంతో.. పద్నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉంటే.. కరోనాను నియంత్రించే అవకాశం ఉందని దేశ ప్రజలకు సూచించాడు.

ఐదుగంటలకు బాల్కనీలో..
అదే విధంగా మనకు సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని స్మరించుకుని, గౌరవించుకునే క్రమంలో అందరూ ఐదు గంటలకు కరతాళ ధ్వనులు చేయాలని ప్రధాని కోరాడు. ఈ క్రమంలో టాలీవుడ్ మొత్తం కదిలింది. కుటంబసమేతంగా కరతాళ ధ్వనులు చేసి వారి సేవలను గుర్తించారు.
కదిలిన టాలీవుడ్..
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ధైర్యంగా నిలబడి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని గౌరవించేందుకు అందరూ కరతాళ ధ్వనులు చేశారు. ఈ క్రమంలో అల్లు ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, గోపిచంద్, వెంకటేష్, ఇలా ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టారు.
మెగా ఫ్యామిలీ చప్పట్లు..
వైద్యులు, పోలీసుల సేవలకు గానూ మెగా ఫ్యామిలీ మొత్తం కరతాళధ్వనులతో గౌరవించింది. ఈ మేరకు అంజనా దేవీ, సురేఖ, సుష్మిత, శ్రీజ పెద్ద కూతురు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. చిరు తన మనవరాళ్లను ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టేలా ప్రోత్సహించాడు. చివరకు షేక్ హ్యాండ్ అంటూ.. అలా చేయోద్దు నమస్కారం అని చెప్పాలంటూ సూచించాడు.
Recommended Video

నాగబాబు ఫ్యామిలీ..
జనతా కర్ఫ్యూలో భాగంగా వైద్యుల సేవలను స్మరించుకుంటూ కరతాళధ్వనులు చేశారు. నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక అందరూ చప్పట్టు కొట్టారు. సెలెబ్రిటీలంతా ఇలా బయటకు వచ్చి చప్పట్టు కొట్టడంతో దేశ ఐకమత్యం వర్థిల్లిందని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











