'జాను' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇప్పుడైనా సమంత సర్‌ప్రైజ్ చేసేనా?
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. 'ఓ బేబీ' తర్వాత ఆమె సినిమా రాకపోవడంతో అందరూ ఆసక్తిగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో ఆమె తాజా సినిమా 'జాను' ఫస్ట్‌లుక్ విడుదల చేశారు కానీ అందులో సమంత కనిపించలేదు. దీంతో ఒకింత ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు.
ఈ పరిస్థితుల్లో 'జాను' టీజర్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయింది చిత్రయూనిట్. ఈ టీజర్‌ని జనవరి 9న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. దీంతో సమంత అభిమానుల్లో మరోసారి ఆతృత మొదలైంది. ఎలాగూ ఫస్ట్‌లుక్‌లో సమంతకు ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి టీజర్‌లో సామ్ సీన్స్ కీలకంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోంది జాను చిత్రం. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 చిత్రానికి రీమేక్ ఈ మూవీ. తమిళంలోనూ ప్రేమ్‌కుమారే డైరెక్ట్ చేశాడు. చిత్రంలో సమంత 'జాను' రోల్ పోషిస్తోంది. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసిన చిత్రయూనిట్.. ఫిబ్రవరి 7న ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











