ట్రెండ్ అవుతున్న జాను ట్రైలర్: సోషల్ మీడియాలో సమంత హంగామా

అక్కినేని సమంత మరోసారి సందడి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె హంగామానే కనిపిస్తోంది. నిన్న (జనవరి 29) సాయంత్రం 5 గంటలకు విడుదలైన 'జాను' ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది.

అంతేకాదు యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ లోకి వచ్చి చేరింది. 'జాను' ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఈ సినిమా సమంత కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవడం ఖాయం అని అంటున్నారు. 'ఎగిసిపడే ఈ కెరటాలు నువ్వు.. ఎదురుచూసే ఈ సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం..దోర నవ్వుల కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది.. నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పు ఇవ్వవా..?' లాంటి ఎన్నో ఎమోషనల్ డైలాగ్స్‌తో టచ్ చేసింది జాను ట్రైలర్.

Janu trailer: Samantha Akkineni in top trending

తమిళ నాట విడుదలై మొత్తం దక్షిణాదిని ఓ ఊపు ఊపిన 96 చిత్రానికి రీమేక్ సినిమాగా 'జాను' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సమంత, శర్వానంద్ లీడ్ రోల్స్ పోషించారు. ఒరిజినల్‌ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఫిబ్రవరి 7న 'జాను' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X