Japan Twitter Review జపాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ను కార్తీ కొల్లగొట్టాడా?
విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న హీరో కార్తీ నటించిన జపాన్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో 25వ చిత్రం కావడం ప్రత్యేకంగా మారింది. జోకర్ మూవీ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజైంది. ఈ సినిమాపై సోషల్ మీడియా నెటిజన్ల అభిప్రాయాల్లోకి వెళితే..

జపాన్ సినిమా హీస్ట్, క్యాట్ అండ్ మౌస్ తరహా సాగే చిత్రం. యాక్షన్ కామెడీ చిత్రంలో రొమాన్స్, ఎమోషన్స్ మిక్స్ చేశారు. కార్తీ ఫెర్ఫార్మెన్స్‌తో ఎపిక్ ఎంటర్‌టైనర్‌గా మారింది. డైరెక్టర్ సీన్లను అద్బుతంగా తీశాడు. జీవీ ప్రకాశ్ మూవీ ఈ సినిమా హైలెట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
హీస్ట్ మూవీ జపాన్‌ను దర్శకుడు రాజ్ మురుగన్ అద్బుతంగా తీశాడు. దొంగ క్యారెక్టర్‌లో కార్తీ తన నటనతో అదరగొట్టాడు. ఫస్టాఫ్ యావరేజ్‌గా, సెకండాఫ్ టాప్ లేపింది. జీవీ ప్రకాశ్ సంగీతం సూపర్‌గా ఉంది. సినిమాటోగ్రఫి అదరగొట్టింది అని నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
జపాన్ ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ట్విస్టులు, టర్నులతో సాగే సినిమాలో స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంది. జీవీ ప్రకాశ్ మ్యూజిక్, బీజీఎం సినిమా మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. రవి వర్మన్ సినిమాటోగ్రఫి బాగుంది.
జపాన్ మూవీ నైస్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రవి వర్మన్ అందించిన సినిమాటోగ్రఫితో విజువల్స్ బాగున్నాయి. కార్తీ కెరీర్‌లో ఇప్పటి వరకు బెస్ట్ ఎంటర్‌టైనర్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.
కార్తీ నటించిన జపాన్ సినిమా రిలీజ్‌కు ముందు ఆయన అభిమానులు పండుగ చేసుకొంటున్నారు. కేరళలోని ఆయన ఫ్యాన్స్ 25 ఫీట్ల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కేరళలో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది.
జపాన్ సినిమా చూడటానికి చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. కార్తీ, రాజు మురుగన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











