ఈ బ్యూటీ జాతి రత్నం కాదు భయ్యా.. మల్టీ టాలెంటెండ్ కా బాప్ !
Faria Abdullah: టాలీవుడ్ హాట్ బ్యూటీ, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). జాతి రత్నాలు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగు కాళ్ల సుందరి. తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ మూవీలో ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టించింది. అలాగే... ఈ మూవీలో ఆమె కామెడీ టైమింగ్ కూడా వేరే లెవల్. 'ఇచ్చేయండి సార్.. బెయిల్ ఇచ్చేయండి' అంటూ ఆమె చెప్పిన డైలాగ్ కు నవ్వని ప్రేక్షకుడు ఉండదు. ఈ సినిమా తరువాత తర్వాత ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్లు కొట్టేసింది. కానీ, సరైన సక్సెస్ పడలేదు పాపం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు వంటి పెద్ద పెద్ద మూవీల్లో నటించింది. కానీ, జాతి రత్నాలు రేంజ్ లో భారీ హిట్ కాలేదు. ఇటీవల భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ లో తళ్కున మెరిగింది.
తాజాగా ఈ బ్యూటీ.. మత్తు వదలరా కు సీక్వెన్స్‌గా వస్తున్న మత్తు వదలరా 2 అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా శుక్రవారం (ఆగస్ట్ 30) ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే పార్ట్ 1 లాగే ఫుల్ సస్పెన్స్ కామెడీ ఎంటర్టైనర్ లా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సారి కూడా శ్రీసింహ, సత్య, వెన్నెల కిశోర్, సునీల్, ఫరియా అబ్దుల్లాలు తమ కామెడీ డోస్ పెంచినట్టు అనిపిస్తోంది. ఈ సారి కూడా ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ మూవీని కూడా రితేష్ రాణా డైరెక్టర్ చేస్తుండగా.. కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించాయి. మెత్తానికి ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.

కాగా ..ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో నటీ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తాను వర్క్ చేసిన టీమ్‌లలో ఈ టీం బెస్ట్ అనీ, షూటింగ్ చాలా సరదగా జరిగిందన్నారు. ఈ సినిమాలో తాను సొంతంగా ఓ ర్యాప్ సాంగ్ రాసాననీ, తాను రాసినా పాటను తానే పడాడనీ, పైగా ఆ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ కూడా తానే చేశానని చెప్పుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకుంటూ పుల్ ఖుషి అయింది. ఈ పొడుగు కాళ్ల బ్యూటీ బెస్ట్ డ్యాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మూవీ మేకర్స్ కు థ్యాంక్ చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరవుతున్నాయి. దీంతో ఈ బ్యూటీ జాతి రత్నం అనుకున్నాం గాని.. మేలీమి రత్నమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











