ఎవరో ఒకరు చచ్చిపోవాలట.. ‘జాతిరత్నాలు’ టీజర్ వైరల్
వైజయంతీ మూవీస్ ఇప్పుడు చిన్న చిత్రాలను ఎంతగా ఎంకరేజ్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వప్నా సినిమాస్‌లో వస్తోన్న చిత్రాలన్నీ కూడా ప్రేక్షకులకు ఇట్టే నచ్చేస్తున్నాడు. వారు నిర్మించిన కంబాల పల్లి కథలు ఎంతగా ఆదరణను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అలాగే అదే దారిలో జాతి రత్నాలు అనే చిత్రం రాబోతోంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్ కాంబోలో వస్తోన్న జాతిరత్నాలు టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది.
జాతిరత్నాలు అంటూ ఈ ముగ్గురిని మెయిన్ లీడ్‌గా పెట్టి మంచి హైప్ క్రియేట్ చేశారు. దీనికి తగ్గట్టే మోషన్ పోస్టర్లు, పోస్టర్లు విడుదల చేశారు. క్రియేటివ్‌గా ఆలోచిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లు బాగానే క్లిక్ అయ్యాయి. ఆ మధ్య లాక్డౌన్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జైల్లో ఉన్న నవీన్ పొలిశెట్టి కూడా.. ఎప్పుడు రిలీజ్ రా అయ్యా అంటూ ఎదురుచూస్తున్నట్టు, బయట ప్రేక్షకులు కూడా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారని పరోక్షంగా చెప్పారు.

తాజాగా విడుదల చేసిన టీజర్‌లో ముగ్గురు రచ్చ రచ్చ చేశారు. ఐదు వందల కోట్ల చుట్టు సినిమా తిరుగుతుందని చెప్పేశారు. చివర్లో నవీన్ వేసిన పంచ్ మాత్రం అదిరిపోయింది. మన లైఫ్‌లో లైఫ్ అండ్ డెత్ సిట్యూవేషన్ వచ్చేసింది.. ఎవరో ఒకరు చచ్చిపోయినా కూడా మిగతా ఇద్దరిని బతికించాలని అనడం.. మీలో ఎవరు చనిపోతున్నారో చెప్పండి అని సెటైర్ వేయడంతో నిజంగానే జాతి రత్నాలు అనిపించుకున్నారు. మొత్తానికి ఈ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











