Jaat : సన్నీడియోల్‌కు షాక్ .. గూస్‌బంప్స్ ఎపిసోడ్‌ను లేపేసిన మేకర్స్

బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ సన్నీడియోల్‌ హీరోగా , తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం జాట్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, ఉమేశ్ కుమార్ బన్సాల్‌లు దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో నర్మించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాట్ చిత్రం అనుకోని చిక్కుల్లో పడింది. ఈ వివరాల్లోకి వెళితే..

జాట్‌లో రణదీప్ హుడా, రెజీనా క్యాసెండ్రా, సయామీ ఖర్, వినీత్ కుమార్ సింగ్‌లు కీలకపాత్రలు పోషించగా.. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. రిషి పంజాబీ సంగీతం హైలైట్‌గా నిలిచింది. సన్నీడియోల్ గత చిత్రం గదర్ 2 వసూళ్ల రికార్డును ఈ సినిమా బద్ధలు కొడుతుందా అన్న చర్చ జరుగుతోంది. హై ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జాట్‌కు తొలిరోజున రూ.9.5 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది.

jatt movie controversy mythri movie makers says delete that scene from sunny deol s film

రెండో రోజున రూ.7 కోట్ల నెట్, మూడో రోజున రూ.9.75 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.14 కోట్ల నెట్, ఐదో రోజున రూ.7.25 కోట్ల నెట్, ఆరో రోజున రూ.6 కోట్ల నెట్, ఏడో రోజున రూ.4 కోట్ల నెట్, 8వ రోజున రూ.4.15 కోట్ల నెట్ రాబట్టింది. మొత్తంగా 8 రోజుల వరకు ఇండియాలో రూ.61.65 కోట్ల నెట్, రూ.72.75 కోట్ల గ్రాస్ అందుకుంది. భారత్‌లో గ్రాస్ + ఓవర్సీస్‌లో వచ్చిన రూ.10 కోట్లు కలిపి జాట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.82.75 కోట్ల గ్రాస్ ఆర్జించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

జాట్ సక్సెస్ నేపథ్యంలో జాట్ 2ని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే జాట్‌కు పాజిటివ్ బజ్ తెచ్చేందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్న అనుమానాలు లేకపోలేదు. అయితే ఇంతలో జాట్‌ ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశం విషయంగా క్రైస్తవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా చేసిన రణదీప్ హుడా ఓ సీన్‌లో చర్చిలో యేసుక్రీస్తు శిలువ ముందు ఆయన లాగే నిలబడగతాడు. అలాగే ప్రార్ధనలు, ప్రశాంత వాతావరణం ఉండే చర్చిలలో హింసాత్మక ఘటనలు జరగడంపై క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి.

ఇలాంటి సన్నివేశాలతో తమ మనోభావాలు దెబ్బతీశారంటూ క్రైస్తవ సంఘాలు రగిలిపోతున్నాయి. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే థియేటర్‌ వద్దకు వెళ్లి నిరసన చేస్తున్నారు. వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. క్రైస్తవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జాట్‌లోని వివాదాస్పద చర్చి సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. అలాగే ఈ సన్నివేశం విషయంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని నోట్ విడుదల చేసింది. ఏ మతాన్ని కించపరచాలన్న ఉద్దేశం తమకు లేదని నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతల నిర్ణయం నేపథ్యంలో ఇకపై ఈ సీన్ లేకుండానే ప్రదర్శనలు జరిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: mythri movie makers sunny deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X