Jawan Twitter Review గ్లోబల్ బ్లాక్ బస్టర్.. షారుక్, అట్లీ, నయనతార చించేశారు.. జవాన్ ట్విట్టర్ రివ్యూ
బాలీవుడ్ బాద్షా, ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల మందుకు వచ్చింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది. ఓవర్సీస్‌లో ఇండియాలో కంటే ముందుగానే ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు దాటిందా? సోషల్ మీడియాలో నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

జవాన్ మూవీ సూపర్ మూవీ. వాటే మూవీ. స్క్రీన్ మీద షారుక్ ఖాన్ నటన విస్పోటనంగా ఉంది. కథ అద్బుతంగా ఉంది. షారుక్ ఫెర్పార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జవాన్ మూవీ బాగుంది. అవుట్ స్టాండింగ్, అన్ బిలీవబుల్. బాలీవుడ్ తెర మీద ఇలాంటి సినిమాను ఇప్పటి వరకు చూడలేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం గ్యారెంటీ. తొలి రోజు రికార్డుల క్రియేట్ చేస్తుంది. మాస్ అవతార్‌లో ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా అంటే ఎలా ఉంటుందో అలా చూపించాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జవాన్ తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమాల్లో జవాన్ ఒకటి. ఇండియాలో ఇలాంటి సినిమాను ఇప్పటి వరకు నిర్మించలేదు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
జవాన్ మూవీ విన్నర్. ఈ సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడు. కింగ్ సైజ్‌డ్ ఎంటర్‌టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండి.
జవాన్ రిలీజ్‌కు ముందే హిస్టరీ క్రియేట్ చేసింది. జవాన్ 557K వసూలు చేసింది. కింగ్ ఖాన్ హవా అంటే ఇది అని జవాన్ కలెక్షన్ల గురించి ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
జవాన్ సినిమా చూసే ప్రేక్షకులు ఎలాంటి వీడియోలు ఫోటోలు పెట్టకండి. సినిమాలోని ఇంట్రెస్టింగ్ అంశాలను లీక్ చేయకండి. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు చాలా కష్టపడ్డారు. వారి శ్రమను వృధా చేయకండి. ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
న్యూజిలాండ్‌లో సినిమా చూస్తన్నాను. జవాన్ సినిమా బాగుంది. షారుక్ ఖాన్ బ్రిల్లియంట్. నయనతార క్యారెక్టర్ అద్బుతంగా ఉంది. ఆమె కూడా బాగా చేసింది. గ్లోబల్ బ్లాక్ బస్టర్ సినిమా జవాన్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











