రూ. 100 కోట్లు.. జయలలిత బయోపిక్ కోసం దిమ్మదిరిగే బడ్జెట్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నిన్నటితరం నటి జయలలిత జీవితం ఆధారంగా 'తలైవి' పేరుతో బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. జయ పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న 'తలైవి' కోసం రూ. 100 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. కంగనా రనౌత్... జయలలిత లుక్‌లోకి మార్చేందుకు పలువురు హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులను హైర్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.

సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం కంగనా రెమ్యూనరేషనే అని టాక్. ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ వెల్లడించిన ప్రకారం.. తలైవి సినిమాలో నటించడానికి కంగన రనౌత్ రూ.24 కోట్ల పారితోషికం అడిగిందట. అందుకు నిర్మాత విష్ణు ఇందూరి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

Jayalalithaa biopic Thalaivi makers are going to spend a whopping Rs 100 cr

జయలలిత బయోపిక్‌ను ప్యాన్ ఇండియా మూవీగా మలిచేందుకు నిర్మాత విష్ణు ఇందూరి ప్రయత్నిస్తున్నారు. మణికర్ణిక తర్వాత కంగన రనౌత్ లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా 'తలైవి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ప్రకటించడానికి ముందే జయలలిత కుటుంబం నుంచి అనుమతి తీసుకున్నారు. ఆమె మేనల్లుడు దీపక్ నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందినట్టు సమాచారం. ఈ చిత్రానికి బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. 2.0 ఫేం నిరవ్ షా సినిమాటోగ్రాఫీ హ్యాండిల్ చేస్తుండగా, జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X