భార్యతో విడాకులు తీసుకొనే వరకు నటించను.. కంటతడి పెట్జిన జయం రవి
కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన జయం రవి- కేనీషా ఫ్రాన్సిస్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. గత కొన్నేళ్లుగా కేనీషాతో కలిసి జీవిస్తోన్న జయం రవికి ఆమెకు మధ్య బ్రేకప్ జరిగింది. ఈ పరిణామాలతో హీరో జయం రవి ఎమోషనల్ అయ్యారు. శనివారం మీడియాకు ముందుకు వచ్చిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్ హీరో రవిమోహన్, నటి కమ్ సింగ్ కెనీషా ఫ్రాన్సీస్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వ్యవహారం చిత్ర పరిశ్రమలో గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో కెనీషా ఫ్రాన్సీస్‌తో రవి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియో తొలుత వైరల్ అయ్యాయి. అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని కోలీవుడ్ కోడై కూసింది. ఆ వెంటనే ఓ కార్యక్రమానికి వీరిద్దరూ జంటగా హాజరు కావడంతో రవిమోహన్ - కెనీషాల డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఆ తర్వాత కొద్దిరోజులకే జయం రవి భార్య ఆర్తి రవి తన భర్తపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తన భర్తకు, నాకు మధ్య కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని అది తేలకుండానే ఆయన మరో నటితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని ఆరోపించింది. మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తమ బంధం విడాకులకు దారి తీసిందని ఆరోపించింది. రవికి అన్ని రకాలుగా అండగా నిలిచానని, కానీ తండ్రిగా, భర్తగా ఆయన ఫెయిల్ అయ్యాడని.. కనీసం కన్నబిడ్డల్ని సైతం పట్టించుకోవడం లేదని ఆర్తి మండిపడింది. అటు రవి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆర్తి రవిపై సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో శనివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయం రవిని తాను వదిలేస్తున్నానని కేనీషా ప్రకటించారు. రవితో రిలేషన్‌లో ఉన్నప్పటి నుంచి తనపై వేధింపులు, చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అందుకే రవిని ఇష్టపడే వారికే అతనిని వదిలేస్తున్నా.. చెన్నై నగరాన్ని కూడా వదిలేస్తున్నానని కేనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
తన ప్రియురాలు కేనీషా బ్రేకప్ చెప్పడంతో జయం రవి మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. తను సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ నాకు లేదు. నా ఆస్తులు, డబ్బును నా భార్య తరపు వాళ్లే ఉంచుకున్నారు. నా పేరు మీద కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా.. పిల్లల కోసమే ఇన్నాళ్లూ బతికా, ఇప్పుడు వారిని కూడా చూడనివ్వడం లేదు. సెక్యూరిటీ గార్డుతో పిల్లల్ని స్కూల్‌కు పంపుతున్నారు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే అన్నింటినీ భరించానని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు.
14 ఏళ్ల తన వైవాహిక జీవితంలో బానిసలా బతికా.. 45 ఏళ్ల వయసులో అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, ఆడవారి గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. ఇన్నాళ్లు నన్ను అర్ధం చేసుకుని తోడుగా నిలిచిన కేనీషాను కూడా టార్గెట్ చేసి వేధింపులు చేసి ఆమెను పంపించేశారు. మూడక్షరాల ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది.. నాతో పాటు ఎన్నో కుటుంబాలను ఆమె కూల్చింది. నా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకుని .. నా భార్యతో విడాకులు తీసుకున్నాకే తిరిగి సినిమాలలో నటిస్తా, అప్పటి వరకు నటించనని జయం రవి వెల్లడించారు. ఇప్పటి వరకు పిల్లల కోసమే నోరు మూసుకుని ఉన్నాను.. ఇకపై నన్ను రెచ్చగొట్టొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. జయం రవి కాపురాన్ని కూల్చిన ఇడ్లీ నటి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



