నన్ను చంపాలని చేతబడి.. రక్తం వాంతులతో నరకం చూస్తున్నా.. జయం రవి ఆవేదన

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితంలో వివాదాలు, భార్యతో విడాకుల కారణంగా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన ప్రియురాలు కేనీషా ఫ్రాన్సిస్ అతనిని వదిలేస్తున్నట్లు బ్రేకప్ ప్రకటన చేయడంతో జయం రవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన ఆయన భార్య, అత్తింటి వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవి వ్యవహారం ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇక చాలు.. ఇప్పటి వరకు నేను మౌనంగానే ఉన్నాను. ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. రవిమోహన్ (జయం రవి) అంటే సౌమ్యుడని జనం భావిస్తారు. నేను నిజంగానే అలాగే ఉండేవాడిని. కానీ ఇకపై మాత్రం కాదు. మృదు స్వభావం కలిగిన వ్యక్తికి కలిగే కోపాన్ని భరించడం కష్టం. ప్రజలు నా సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు విడాకులు మంజూరయ్యేంత వరకు నేను సినిమాలలో నటించను. నాకు విడాకులు ఎప్పుడొస్తే అప్పుడే నా జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ సైబర్ వేధింపులు ఎప్పుడు ఆగిపోతాయో అప్పుడే నేను తిరిగి వస్తాను. రెండు దశాబ్ధాలకు పైగా సినీరంగంలో శ్రమించాను. నా సినిమాలలో అత్యధిక శాతం విజయవంతం అయ్యాయని జయం రవి తెలిపారు.

Jayam Ravi Makes Explosive Allegations on his Wife Aarti Ravi Amid Divorce Controversy

సోషల్ మీడియాలో నా జీవితంపై రాతలు రాస్తున్న వారు నీచులు. దాని వెనుక ఎవరున్నారనే దానిపై నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. పనికిమాలిన ఆ నటికి స్త్రీ వాదం గురించి బోధించే అర్హత లేదు. కుటుంబాలను నాశనం చేసిన తర్వాత బహిరంగ వేదికలపై స్త్రీ వాదం గురించి మాట్లాడే హక్కు ఆమెకు ఏముంది. నా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నేను పెళ్లి చేసుకున్నా. అలా చేసినందుకు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాను. ఈ టార్చర్‌తో ఒకరోజున మణికట్టును కోసుకున్నాను. అయినాసరే మరుసటి రోజే షూటింగ్‌కు హాజరయ్యాను. పని పట్ల నాకున్న నిబద్ధత అలాంటిదని జయం రవి వెల్లడించారు.

నా కుమారుడు ఆరవ్, అయాన్‌లను కలుసుకోవడానికి నన్ను అనుమతించడం లేదు. వారిద్దరినీ స్కూల్‌కు పంపేటప్పుడు అంగరక్షకులతో పంపిస్తున్నారు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండటానికి నేను పోరాడుతున్నాను. మౌనమే నా అతిపెద్ద పొరపాటుగా మారింది. కొందరు దానిని ఆసరాగా చేసుకుని.. వారి ఆటలు ఆడారు. కొన్నేళ్లుగా నేను నోరు మెదపకుండా ఉండిపోయాను. ఇప్పుడు అందరూ నన్ను బలహీనుడిగా చూస్తున్నారు. స్త్రీలను గౌరవించడం ఎలాగో నేర్పిన తల్లి ఒడిలో నేను పెరిగాను. నా సినిమాలలో కూడా నేను ఎప్పుడూ స్త్రీ పాత్రలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చాను. అయినప్పటికీ నేను స్త్రీ వ్యతిరేకిని అన్నట్లుగా అవమానిస్తున్నారని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రోజుకీ నాకంటూ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లేదు. కేవలం జాయింట్ ఖాతా మాత్రమే ఉండేది. చిన్న మొత్తాన్ని విత్ డ్రా చేసినా సరే.. ఆ డబ్బు ఎందుకు తీసుకున్నావంటూ వెంటనే ఫోన్ వచ్చేది. కష్టపడి నేను సంపాదిస్తున్నప్పటికీ ఆ బాధలు మౌనంగానే భరించాను. ఆమె తన చేయి కట్ చేసుకుని పెళ్లి చేసుకోమని బ్లాక్‌మెయిల్ చేయడంతో పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన క్షణం నుంచే నరకం చూశా. నా మీద వాళ్లు చేతబడి చేయించారు.. ఇప్పుడు రక్తం వాంతులతో బాధపడుతున్నా. వాళ్తు గతంలోనూ ఇలాంటివి చేశారు.. ఇప్పటికీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేయడానికి కొన్ని పీఆర్ గ్రూపులకు డబ్బులు చెల్లించి నా మీద ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఇప్పుడు నేను నెమ్మదిగా మరణిస్తున్నా.. కానీ చనిపోయేలోపు మాత్రం అందరినీ అంతం చేస్తానని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు.

నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు వారితోనే గడిపాను. నా పిల్లలను ఎలా వదిలి వెళ్లగలను? వాస్తవాలు తెలియకుండా నా మీదున్న ప్రేమను దయచేసి ప్రశ్నించకండి. మా అబ్బాయిని సంతోషపెట్టడానికి ప్రతిరోజూ అతనితో చదరంగం ఆడుతూ కావాలని ఓడిపోయేవాడిని. ఈసీఆర్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు కొని.. కుటుంబం కోసం అన్నీ చేశాను. అయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నా ఇల్లును వాళ్లే లాక్కున్నారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నా.. శారీరకంగా, మానసికంగా హింసించి నన్ను చంపేయాలని కుట్ర చేస్తున్నారు. ఇన్నాళ్లు నన్ను అర్ధం చేసుకుని తోడుగా నిలిచిన కేనీషాపై దుష్ప్రచారం చేయించి ఆమెను పంపేశారని జయం రవి వాపోయారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X