వెండితెరపై మళ్లీ జయప్రద మెరుపులు.. 31న సువర్ణ సుందరిగా ప్రేక్షకుల ముందుకు

అలనాటి అందాల నటి జయప్రద మళ్లీ తెలుగు తెరపై తళుక్కుమననున్నారు. పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కిన చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్ఎస్ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. భవిష్యత్తును చరిత్ర వెంటాడుతున్నది అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ సాంకేతికంగా అద్బుతంగా రూపొందింది. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... సువర్ణ సుందరి చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది. టైమ్ తీసుకున్నా అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా వ‌చ్చింది. గత కొంతకాలంగా తెలుగులో స్క్రీన్ ప్లే బెస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తొందు. సువర్ణ సుందరి సైతం మూడు జన్మల కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో రూపొందిచాg. ఆడియెన్స్ ఆకట్టుకొవటంతోపాటు, కమర్షియల్‌గా పక్కా హిట్ కొడతామన్న నమ్మకంతో ఉన్నాం అని తెలిపారు.

Jayapradas suvarna Sundari set to release on May 31st

నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌ సువర్ణ సుందరి చిత్ర ట్రైలర్ ‌ సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఆకట్టుకున్నది. బడ్జెట్ ఎక్కువయినా, క్వాలిటీ అవుట్ పుట్ చూసిన తర్వాత సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. చిత్రం సెన్సార్‌కు సిద్దమయింది. తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

నటీనటులు: జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్ మద్దుకూరి, సాయికుమార్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, ముఖ్తర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌డైరెక్ట‌ర్: సాయికార్తీక్‌, స్టంట్స్: రామ్‌ సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు, డి.ఓ.పి: ఎల్లు మహంతి, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి, స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, ప్రొడ్యూస‌ర్: ఎం.ఎల్‌.ల‌క్ష్మి, డైరెక్ట‌ర్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X