చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణం అదొక్కటే.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్

చిరంజీవి.. కొన్ని దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమపై రారాజుగా వెలుగుతూ వస్తున్న సీనియర్ హీరో. మెగాస్టార్ గా వెలుగొందుతూ ఆ మధ్యకాలంలో పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన చిరు, తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన క్రేజ్ ఒకింత డబుల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఖైదీ నెంబర్ 150 తో చిరంజీవి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాక ఇక నుంచి వెండితెరపై మెగాస్టార్ సినిమాలు చూసేయొచ్చని ఖుషీ అయ్యారు మెగా అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ జయసుధ.. చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు చూస్తే..

నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు

నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు

బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి నేటి డిజిటల్ యుగం వరకు అలుపెరగని చిరంజీవి సినీ ప్రయాణం కొనసాగిస్తున్నారు చిరంజీవి. ఈ ప్రయాణంలో ఎందరో హీరోయిన్లతో కలిసి నటించారు చిరు. మెగాస్టార్‌గా కీర్తించబడుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ జయసుధ ఆయనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

చిరు ఎంట్రీ ఇచ్చిన సమయంలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్

చిరు ఎంట్రీ ఇచ్చిన సమయంలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్

తాను చిరంజీవి సరసన నటించింది ఒకే ఒక సినిమాలో అయినప్పటికీ, సినిమా కోసం ఆయన పడే కష్టం ఎలాంటిదో తనకు బాగా తెలుసని చెప్పింది జయసుధ. సినిమాల్లోకి చిరు వచ్చిన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలు తెలుగు తెరపై వెలిగిపోతున్నారని ఆమె తెలిపింది. అయినా అందరినీ తట్టుకొని నిలబడ్డారని ఆమె చెప్పుకొచ్చింది.

చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణం

చిరంజీవి మెగాస్టార్ కావడానికి కారణం

చిరంజీవి తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎదిగారని, ఆ స్టైల్‌తో ప్రేక్షక లోకాన్ని తనవైపు తిప్పుకోవడంలో చిరు ఎన్నో కష్టాలు పడ్డారని జయసుధ చెప్పింది. ఇక ఏ సినిమా సెట్లో అయినా చిరంజీవి, తన పని పట్ల చూపే అంకితభావం మాటల్లో చెప్పలేనిది, ఆ కారణంగానే ఆయన మెగాస్టార్‌ అయ్యారని చెప్పుకొచ్చింది జయసుధ.

 చిరు సినీ ప్రయాణం.. 151 మూవీ

చిరు సినీ ప్రయాణం.. 151 మూవీ

ఇక చిరంజీవి సినీ ప్రయాణం గురించి చెప్పుకుంటే.. దశాబ్దాల కాలంగా అలరిస్తూ వస్తున్న చిరంజీవి మరికొద్ది రోజుల్లో తన 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. తన 152 వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు చిరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X