యాంకర్ విష్ణుప్రియతో వివాహం.. అలా ప్రేమలో పడింది.. జేడీ చక్రవర్తి క్లారిటీ

టాలీవుడ్ యాంకర్లలో బ్యూటిఫుల్ విష్ణుప్రియ ఒకరు. ప్రస్తుతం యాంకర్ గా చేయని విష్ణుప్రియ భీమనేని గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఎక్కువగా సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోతో యమ పాపులర్ అయింది. ప్రస్తుతం షోలలో మెరుస్తున్న విష్ణుప్రియతో వివాహంపై నటుడు జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చారు.

నేరుగా ఓటీటీలో:ఇటీవల యాంకర్ లలో మంచి పేరు తెచ్చుకున్న అందమైన తెలుగు అమ్మాయిల్లో విష్ణుప్రియ బీమనేని ఒకరు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పలు చిన్న వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది. ఆ తర్వాత చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా అప్పుడు విడుదల కాలేదు. తర్వాత 2021లో ఓటీటీలో నేరుగా విడుదలైంది.

JD Chakravarthy Gives Clarity On Marriage With Anchor Vishnu Priya

బుల్లితెరపైకి:చెక్ మేట్ సినిమాలో యాంకర్ విష్ణుప్రియ చేసిన హాట్ షో అంతా ఇంతా కాదు. ఘాటు క్లీవేజ్ షోతోపాటు లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయింది. అంతేకాకుండా బికినీలో దర్శనమిచ్చి యూత్ కు మతిపోగోట్టింది. తర్వాత దగ్గుబాటి రానా హోస్ట్ గా చేసిన నెంబర్ వన్ యారీ టాక్ షోలో పనిచేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ యాంకర్ గా పాపులర్ అయింది.

JD Chakravarthy Gives Clarity On Marriage With Anchor Vishnu Priya

వీడియో సాంగ్స్ తో:యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ తర్వాత వరుసగా సినీ అకాశాలు అందుకుంది. వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటించి హాట్ షో చేసింది. అంతేకాకుండా పలు వీడియో సాంగ్స్ తో కూడా అలరించింది. ఇక ఆ మధ్య సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న యాంకర్ విష్ణుప్రియ.. నటుడు జేడీ చక్రవర్తి అంటే ఇష్టమని చెప్పింది.

JD Chakravarthy Gives Clarity On Marriage With Anchor Vishnu Priya

విష్ణుప్రియతో పెళ్లి:జేడీ చక్రవర్తిని ప్రేమిస్తున్నట్లుగా చెప్పిన యాంకర్ విష్ణుప్రియ వాళ్ల అమ్మ ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని అంది. అప్పట్లో ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై తాజాగా చక్రవర్తి క్లారిటీ ఇచ్చారు. దయ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా చేస్తున్న ఇంటర్వ్యూలో విష్ణుప్రియతో పెళ్లి, ప్రేమ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

40 రోజులు:"విష్ణుప్రియ ఎంతో మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవల ఓ సిరీస్ లో నటించాం. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సిరీస్ కోసం సుమారు 40 రోజులు కలిసి పని చేశాం. ఆ సిరీస్ దర్శకుడు పవన్ సాధినేని ఓసారి విష్ణుప్రియకు చిన్న సలహా ఇచ్చాడు. అదేంటంటే ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని" చెప్పాడు అని జేడీ చక్రవర్తి తెలిపారు.

JD Chakravarthy Gives Clarity On Marriage With Anchor Vishnu Priya

ఆ అనుబంధమే:"అలా నేను నటించిన సినిమాలన్నీ చూసి ఆయా చిత్రాల్లోని పాత్రలతో విష్ణుప్రియ ప్రేమలో పడ్డారు. అంతే తప్పా ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురు శిష్యుల అనుబంధమే ఉంది. మేము చాలా తక్కువగా మాట్లాడుకుంటాం" అని జేడీ చక్రవర్తి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X