నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..కానీ,

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు పొందిన జె.డి. చక్రవర్తి (JD Chakravarthy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జేడీ వర్తి, తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఆయన తాజాగా ఓ ఈవెంట్ లో కమల్ హసన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?

తరుణ్ భాస్కర్ హీరోగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గాయపడ్డ సింహం' (GPS).ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తుండగా, పవన్ సాదినేని సమర్పణలో నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇందులో జె.డి. చక్రవర్తి ఒక పవర్‌ఫుల్, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న జె.డి . చక్రవర్తి.. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తావన తీసుకువచ్చారు.

JD Chakravarthy Praises Kamal Haasan Hypes His Role in Gayapadda Simham

తన కెరీర్‌లోనే 'గాయపడ్డ సింహం' సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయి అవుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆయన చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ' సినిమా పరిశ్రమలో నటనకు ఒక కొలబద్ద కమల్ హసన్ ( Kamal Haasan). కమల్ హాసన్ గారు చేసిన పాత్రలు ప్రపంచంలో ఎవరూ చేయలేరు. భవిష్యత్తులో కూడా ఆ స్థాయిని అందుకోవడం కష్టం. కానీ ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ మాత్రం ఆయనకు కూడా దక్కని అదృష్టం' అని అన్నారు. అయితే వెంటనే తన వినయాన్ని చూపిస్తూ, 'యాక్టర్‌గా నేను ఆయన కాలిగోటికి కూడా సరిపోను' అని చెప్పడం విశేషం.

'గాయపడ్డ సింహం'లో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని జేడీ వివరించారు. ఫస్ట్ హాఫ్‌లో ఒక రకంగా, సెకండ్ హాఫ్‌లో పూర్తిగా మరో రూపంలో కనిపించేలా పాత్ర డిజైన్ చేశారని తెలిపారు. ఈ క్యారెక్టర్‌లో అనేక వేరియేషన్స్ ఉంటాయని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని చెప్పారు. 'ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు ఎవరూ చేయలేదు... కమల్ హాసన్ గారు కూడా చేయలేదు' అంటూ ఆయన చెప్పడం సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.

తన గత కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ 'మనీ', 'శివ', 'అనగనగా ఒక రోజు' వంటి చిత్రాలు తనకు మైలురాళ్లుగా నిలిచాయని తెలిపారు. అలాంటి స్థాయి ఉన్న పాత్రలు మళ్లీ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నానని, ఇప్పుడు 'గాయపడ్డ సింహం' ఆ కోవలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలుస్తుందని జేడీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో నటుల కంటే డైరెక్టర్లే ఎక్కువగా ఉన్నారని, ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా తీసే వరకు దర్శకుడు ఎక్కడా రాజీ పడలేదని వెల్లడించారు. 'ప్రతి సన్నివేశం అర్థమయ్యేలా, నచ్చేలా రావడం వరకు డైరెక్టర్ వదిలిపెట్టలేదు'అని చెప్పారు.

మొత్తానికి, తన పాత్రతో పాటు సినిమా మీద కూడా భారీ అంచనాలు పెంచేలా జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఒక బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఆయన, 'గాయపడ్డ సింహం'తో మరోసారి తన నటన శక్తిని చూపించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే.. జె.డి. చేసిన ఈ కామెంట్స్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X