‘హీరోయిన్లంటే వాళ్లకి అదే ఆలోచన... ఆ డైరెక్టర్‌ని అందుకే కొట్టా’
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, హీరోయిన్లపై వేధింపులు గురించి ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరో ఒకరు బాంబు పేలుస్తూనే ఉంటున్నారు. సినిమాలలో అవకాశాల పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో శారీరక వాంఛలు తీర్చుకునేవారు కొందరైతే.. పని ప్రదేశంలో వేధింపులకు గురిచేసేవారు మరికొందరు. అన్యాయాన్ని కొందరు చూసీ చూడనట్లుగా వదిలేసినా.. కొందరు మాత్రం ఎదురుతిరుగుతారు. తన కళ్లముందు దర్శకుడు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అతనికి బుద్ధి చెప్పాడు ఓ హీరో. ఈ వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కల్ట్ సినిమాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న శివ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జేడీ చక్రవర్తి అంచెలంచెలుగా ఎదిగారు. మనీ, రక్షణ, వన్ బై టూ, అనగనగా ఒక రోజు, గులబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయెరా తదితర చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగా హోమం, సిద్ధం వంటి చిత్రాలతో సత్తా నిరూపించుకున్నారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చి ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ మూవీలతో ప్రేక్షకులను అలరించారు జేడీ చక్రవర్తి. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా పలు రకాలుగా సినీరంగానికి సేవలందిస్తున్నారు చక్రవర్తి. ఒకప్పుడు కాలేజీ అమ్మాయిల్లో జేడీ చక్రవర్తికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పటికీ ఆయనంటే పడిచచ్చిపోయే వారున్నారు. ఇటీవల సినిమాలు తగ్గించిన ఆయన.. ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొద్దిరోజుల క్రితం గాయపడ్డ సింహం సినిమాలో జేడీ చక్రవర్తి కీలకపాత్ర పోషించగా ఆయన పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు.
ఒక సినిమా కల్ట్‌గా మారడానికి ప్రధాన కారణం దర్శకుడే. కంటెంట్ ఈజ్ ది కింగ్ అంటున్నారు కానీ కంటెంట్ ఈజ్ ది క్వీన్. డైరెక్టర్ ఈజ్ ది కింగ్ అన్నది నా అభిప్రాయం. కంటెంట్‌ను సరిగా చెప్పకపోతే ఉపయోగం లేదు. కల్ట్ చేయగలిగే సత్తా ఉన్నది దర్శకుడికే. మనీ, అనగనగా ఒకరోజు లాంటి సినిమాలు మళ్లీ ఇంకోకటి వస్తే బాగుండు అని నా మనసులో బలమైన కోరిక ఉండేది అని జేడీ చక్రవర్తి అన్నారు.
ఖడ్గం మూవీలో ఒక డైరెక్టర్ అయ్యుండి కృష్ణవంశీ గారు డైరెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారో చూపించారు. మీకు ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని యాంకర్ అడగ్గా.. దానికి చక్రవర్తి ఆన్సర్ ఇచ్చారు. నేను నటించిన ఒక సినిమాలో అమ్మాయిని డైరెక్టర్ కొంచెం మిస్ బిహేవ్ చేయబోతుంటే కొట్టా. ఆ సినిమా ఏంటీ? అనేది ఎందుకు చెప్పడం లేదంటే ఆ సినిమాకు సంబంధించిన వాళ్లు కొందరు ఈ భూమ్మీద బతికిలేరు. అలాంటిప్పుడు వారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. మన సినిమా ఇండస్ట్రీలో 95 శాతం మంచి వాతావరణమే ఉంటుంది. కానీ ఈ 5 శాతం మాత్రమే బయటికి కనిపిస్తుంది. కానీ మిగిలిన ఇండస్ట్రీలలో 95 శాతం ఈ తరహా పరిస్ధితి ఉండొచ్చు. నేను చెప్పేది రెండేళ్ల క్రితం నాటి సంగతి. కానీ ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో చాలా మార్పు వచ్చిందని జేడీ చక్రవర్తి చెప్పారు.
ఆ 5 శాతం కూడా ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ కాదు. ఏదో బిజినెస్ చేస్తూ.. సరదాగా సినిమాలు చేద్దాం, సినిమా చేస్తే ఇలాంటివి ఉంటాయని ఊహించుకుని మిస్ బిహేవ్ చేస్తుంటారు తప్పించి ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి పిచ్చి వేషాలు వేయరు. ఎందుకంటే వాళ్లకి సినిమా ముఖ్యం. సినిమా తీయడం ముఖ్యం, అది ఆడటం ముఖ్యం. మేం డబ్బులు తీసుకుని చేస్తాం.. వాళ్లు డబ్బులిచ్చి చేయించుకుంటారు. ఏదైనా చిన్న అపశృతి జరిగితే మొత్తమంతా అభాసుపాలు అయిపోతారు. కాబట్టి ప్రొఫెషనల్స్ ఎవరూ చేయరు. ఆడపాదడపా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు, ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి అరేయ్ సినిమా ఇండస్ట్రీలో చేస్తే ఇలా ఉంటుందట అని అనుకుని వచ్చినవాళ్లు చేస్తారు. ఆ కోవకి చెందినవాళ్లు బాగా తగ్గిపోయారు అని జేడీ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినీ రంగంలో పరిస్ధితులపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



