twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    JD Lakshminarayana టాలీవుడ్ ఎంట్రీ.. భీమదేవరపల్లి బ్రాంచ్‌లో పవర్‌ఫుల్ పాత్రలో..!

    |

    అవినీతి, అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సినీ రంగంలోకి ప్రవేశించారు. భీమదేవరపల్లి బ్రాంచి అనే సినిమా ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో జేడీ లక్ష్మీనారాయణతోపాటు ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా నటించడం విశేషంగా మారింది.

    భీమదేవరపల్లి బ్రాంచీ చిత్రంలో జీడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపిస్తారు. కథకు, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పాత్ర ఇది. గతంలో ఎంతో మంది నటించమని అడిగినా ఆయన నో చెప్పారు. అయితే మా కథ చెప్పినప్పుడు ఆయన ఎమోషనల్‌గా స్పందించారు. వెంటనే కీలక పాత్రలో నటించడానికి ఒప్పుకొన్నారు అని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.

     JD Lakshminarayana into Tollywood as actor with Bheema Devarapally Branch movie

    ఇక ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావుని కూడా గతంలో రాంగోపాల్ వర్మ తన సినిమాలో నటించమని అడిగారు. అయితే ఆర్జీవిని ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. అయితే సినిమా కథ విన్న తర్వాత సమాజానికి ఈ స్టోరి ఎంతో అవసరమని భావించారు. మా రిక్వెస్ట్‌కు సానుకూలంగా స్పందించి నటించేందుకు ముందుకు వచ్చారు అని రమేష్ చెప్పాల పేర్కొన్నారు.

    ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వాస్తవ సంఘటన ప్రేరణతో భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను Neorealism ఉట్టిపడేలా స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్‌లో నిర్మించారు. దర్శకుడు చెప్పాలనుకున్న కథలో సహజత్వం పోకూడదనే కారణంతో థియేటర్ ఆర్టిస్టులని వెతికి నటింపజేశారు. వాస్తవికతను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది అని తెలిపారు.

    నటీనటులు: అంజి బాబు, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్, శుభోదయం సుబ్బారావు, సీఎస్ఆర్ వివారెడ్డి, బుర్ర శ్రీనివాస్ తదితరులు
    బ్యానర్: ఏబీ సినిమాస్ అండ్ నిహాల్ ప్రొడక్షన్స్
    రచన, దర్శకత్వం: రమేశ్ చెప్పాల
    నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి
    కెమెరా: కె. చిట్టి బాబు
    సంగీతం: చరణ్ అర్జున్
    సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ
    ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
    పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
    ఆర్ట్: మోహన్
    పీఆర్వో: శ్రీధర్.

    English summary
    CBI JD, Police officer VV Lakshminarayana is entering into Tollywood with Bheema Devarapally Branch. Director Ramesh Chappala has shared the details of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X