twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రత్యేక హోదా తెస్తారు.. ప్రామిసింగ్ లీడర్ జగన్.. ఇంత బలంగా ఎందుకు చెబుతున్నామంటే: జీవిత రాజశేఖర్

    |

    Recommended Video

    Jeevitha Rajasekhar Comments On YS Jagan Mohan Reddy Victory || Filmibeat Telugu

    దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి ముగిసినట్లే. ఎవరు గెలుస్తారా? అని ఇన్నాళ్లు ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డినే కోరుకున్నారు. అధికార టీడీపీని చిత్తుగా ఓడించి.. వైఎస్సార్ సీపీకి నీరాజనం పలికారు. దీంతో వైసీపీ ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ లీడర్స్, నటులు జీవిత రాజశేఖర్.. జగన్‌పై చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి.

     ఎలక్షన్ ముందే చేరాం..

    ఎలక్షన్ ముందే చేరాం..

    నిజానికి మొదట జీవిత రాజశేఖర్ వైసీపీ నేతలే. అయితే జగన్ తో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఆ పార్టీని వీడిన వారు.. తిరిగి 2019 ఏప్రిల్ నెలలో అదే వైసీపీ గూటికి చేరారు. ఆ సమయంలో తమ మధ్య విభేదాలు తొలగాయని జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు. కాగా తాజాగా ఎన్నికల ఫలితాల్లో జగన్ విజయ దుందుభి చూసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన జీవిత రాజశేఖర్ తాము ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీలో చేరామని గుర్తుచేసుకున్నారు. అందువల్లే పెద్దగా ప్రచారం చేయలేక పోయామని అన్నారు.

    మేం ప్రచారం చేసిన ప్రతీ చోట

    మేం ప్రచారం చేసిన ప్రతీ చోట

    వైసీపీ ఎలక్షన్ కాంపెయినింగ్ లో భాగంగా వైసీపీ తరఫున తాము ప్రచారంలో పాల్గొంది కొద్ది రోజులే అయినా ప్రచారం చేసిన ప్రతీ చోట వైసీపీ విజయం సాధించిందని జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు. జగన్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని, ఏపీ ప్రజలు అందించిన ఈ విజయానికి జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా అర్హులని ఈ సందర్బంగా వారు చెప్పారు.

    జగన్ ప్రామిసింగ్ లీడర్

    జగన్ ప్రామిసింగ్ లీడర్

    ఏపీ ప్రజలకు ప్రామిసింగ్ లీడర్ ముఖ్యమంత్రిగా వచ్చారని జీవిత రాజశేఖర్ పేర్కొనడం విశేషం. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ మార్క్ కనిపిస్తుందని అన్నారు. ఈ ఐదేళ్లలో జగన్ పాలన చూసి వచ్చేసారి కూడా ప్రజలు జగన్ కే పట్టం గట్టడం ఖాయం అని అన్నారు జీవిత రాజశేఖర్.

    ఇంత బలంగా ఎందుకు చెబుతున్నామంటే

    ఇంత బలంగా ఎందుకు చెబుతున్నామంటే

    జగన్ పాలన ఆధ్బుతంగా ఉంటుందని, రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ అభివృద్ధి పథంలో నడుపుతారని ఇంత బలంగా ఎందుకు చెబుతున్నామంటే ప్రజలపై, ప్రజా సంక్షేమంపై జగన్ లో ఉన్న బలమైన ఆలోచనలే అంటున్నారు జీవిత రాజశేఖర్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా జగన్ లో ఉందని ఈ సందర్బంగా జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు. ఇక దేశంలో మోడీ గెలుపుపై కూడా వారు ఆనందం వ్యక్తం చేయడం విశేషం.

    ఎన్నికలకు ముందు జీవిత, రాజశేఖర్‌లు

    ఎన్నికలకు ముందు జీవిత, రాజశేఖర్‌లు

    2009 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉండగా జీవిత, రాజశేఖర్‌లు కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత జగన్ వైసీపీ పెట్టడంతో మద్దతు పలికి కొద్ది కాలానికి జగన్‌తో విభేదాల కారణంగా వైసీపీ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న రాజశేఖర్ దంపతులు గతేడాది చంద్రబాబును కలిసి మద్దతు పలికారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరి ట్విస్ట్ ఇచ్చారు.

    English summary
    In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got presigious win. Jeevitha, Rajasekhar comments on this victory
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X