twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరోపణల పై స్పందించిన జీవిత రాజశేఖర్.. 26 కోట్లు డబ్బా లేక వేసుకునే కోట్లా?

    |

    జీవిత, రాజశేఖర్ తమని మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ అనే సంస్థను నడుపుతున్న ఇద్దరు దంపతులు తిరుపతి వేదికగా మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు తమ దృష్టికి వచ్చిన వెంటనే జీవిత రాజశేఖర్ కూడా 23వ తేదీన జరగబోయే శేఖర్ సినిమా ప్రెస్ మీట్ లో సదరు ఆరోపణల మీద స్పందిస్తామని మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియాకు సమాచారం ఇచ్చిన విధంగా ఈ విషయం మీద జీవితా రాజశేఖర్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆరోపణలు

    ఆరోపణలు


    రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శేఖర్. ఈ సినిమా మే నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన జోసెఫ్ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ కరోనా తదితర కారణాల రీత్యా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైన క్రమంలో అనూహ్య పరిస్థితుల్లో హీరో రాజశేఖర్, జీవిత మీద అనుకోని ఆరోపణలు వెల్లువెత్తాయి.

     మోసం చేశారంటూ

    మోసం చేశారంటూ


    గరుడ వేగ సినిమా నిర్మిస్తున్న సమయంలో ఎవరూ కూడా డబ్బులు ఇవ్వని నేపథ్యంలో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ తమను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరారు అని ఈ నేపథ్యంలో రాజశేఖర్ జీవిత దంపతులకు సంబంధించిన ఆస్తులు తనఖా పెట్టుకుని 26 కోట్ల రూపాయలు ఇచ్చామని కోటేశ్వరరావు, హేమ అనే ఇద్దరు దంపతులు మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు తమ దగ్గర తనఖా పెట్టిన ఆస్తిని బినామీ పేర్లతో వేరే వాళ్ళకి బదిలీ చేశారని, తమను మోసం చేశారంటూ వారు వాపోయారు. అంతే కాదు జీవిత రాజశేఖర్ చాలా డేంజరస్ మనస్తత్వం ఉన్న వ్యక్తిని కూడా అని చెప్పుకొచ్చారు.

    ఒప్పుకునే ధైర్యం ఉంది

    ఒప్పుకునే ధైర్యం ఉంది


    ఈ విషయం మీద జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ చెక్ బౌన్స్ కేసులో మాకు ఎలాంటి సమన్లు అందలేదని, అందకుండా చేశారని ఆమె ఆరోపించారు. కోర్టులో నడుస్తున్న కేసు మీద మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి తీర్పు వచ్చాక మాట్లాడతాను అని ఆమె అన్నారు.. ఏమో భర్తపై కేసు ఉందని అతని వల్ల మా మేనేజర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జీవిత పేర్కొన్నారు. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే అది అందరి ముందు ఒప్పుకునే ధైర్యం తమకు ఉందని ఆమె వెల్లడించారు.

    చట్టం చూస్తూ ఊరుకోదు

    చట్టం చూస్తూ ఊరుకోదు


    నిజానికి గరుడవేగ అనే సినిమా కి ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు అని ఈ సినిమాకి ఫైనాన్స్ చేసింది సుధాకర్ రెడ్డి అని ఆమె వెల్లడించారు. సుధాకర్ రెడ్డి కోటేశ్వరరావుకి ఇచ్చారు మేము కాదని అనడం లేదని అన్నారు. కోర్టులో వారు ఎలాంటి ఆధారాలు బయట పెడతారో చూడాలని ఆమె అన్నారు. మమ్మల్ని ఎవరు అరెస్టు చేయలేదు ఎవరు జైలులో పెట్టలేదు అని పేర్కొన్న ఆమె మేము ఎక్కడికి పారిపోలేదు అని అన్నారు. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు అని ఆమె చెప్పుకొచ్చారు.

    ఉండేవాళ్లం కాదు

    ఉండేవాళ్లం కాదు


    ఎవడైతే నాకేంటి సినిమాకి కోటేశ్వరరావు ప్రొడ్యూసర్ అని సినిమాకి సంబంధించి అతనే డబ్బులు ఇవ్వాలని ఆమె అన్నారు. ఇప్పుడు ఏకంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలి అని అంటున్నారని అది వేసుకుని కోట్లా లేక డబ్బులా అనేది నాకు తెలియదు అని వెటకారం ఆడారు. మాపై కావాలని బురద జల్లుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. నిజంగా డేంజరస్ మనుషులం అయితే కనుక 35 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉండేవాళ్లం కాదు అని ఆమె వెల్లడించారు.

    English summary
    Jeevitha Rajasekhar responds on cheating allegations on them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X