For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HI Five ఓసారి హాస్పిటల్ ఉంటే.. అలాంటి వాడే స్నేహితుడు.. అమ్మ రాజశేఖర్‌పై ఘాటైన కామెంట్

  |

  కొరియోగ్రాఫర్ నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన అమ్మ రాజ‌శేఖ‌ర్ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం HI Five. ఫ‌న్ అండ్ గ‌న్ అనేది ఉప‌శీర్షిక‌. అమ్మ రాజశేఖర్ సతీమణి రాధా రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌. ఎస్‌ఎస్‌ థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు. కొత్త పాత న‌టీనటుల క‌ల‌యిక‌తో రూపొందిన ఈ చిత్రం జూలై 22న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం రాత్రి హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌లో ఘ‌నంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వ‌హించారు. ఈ వేడుకలో జీవితా రాజశేఖర్, రవికుమార్ చౌదరీ, సూర్య కిరణ్, రాధా రాజశేఖర్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

  కోవిడ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు

  కోవిడ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు


  అమ్మ‌ను ఎవ‌రైతే చ‌క్క‌గా చూసుకుంటారో వారే అంద‌రిక‌న్నా ధ‌న‌వంతులు. మాకు స‌క్సెస్ వ‌స్తే నా కుటుంబానికే వ‌చ్చింద‌ని అమ్మ రాజ‌శేఖ‌ర్‌ అనుకునేవారు. ఇలాంటి వ్య‌క్తులు అరుదుగా ఉంటారు. Hi Five సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు నాకు చెప్పాడు. ఆ త‌ర్వాత చాలా క‌ష్టాలు, ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాన‌ని అన్నాడు. అవ‌న్నీ ఎదుర్కుకొని నిల‌బ‌డ్డాడు. అలాంటి వారికి స‌పోర్ట్‌గా వుండాల‌ని ఈ వేడుకు వ‌చ్చాను. ఈ రోజుల్లో సినిమా రూపురేఖ‌లు మారిపోయాయి. కోవిడ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు పెద్ద‌గా థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఓటీటీ అనేది స‌పోర్టింగ్‌గా నిలిచింది. HI Five సినిమాకు డ‌బ్బులు బాగా వ‌చ్చి అమ్మ రాజ‌శేఖ‌ర్ భార్య రాధ‌కు మంచి వ‌సూళ్ళు రావాల‌ని కోరుకుంటున్నాను అని జీవితా రాజశేఖర్ అన్నారు.

   అమ్మ రాజ‌శేఖ‌ర్ క‌ష్ట‌జీవి..

  అమ్మ రాజ‌శేఖ‌ర్ క‌ష్ట‌జీవి..


  అమ్మ రాజ‌శేఖ‌ర్ నాకు డాన్స‌ర్‌గా పనిచేసే సమయం నుంచి తెలుసు. సినిమా పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ డాన్స్ డైరెక్ట‌ర్‌గా మారాడు. ఆ త‌ర్వాత చిత్ర ద‌ర్శ‌కుడు కూడా అయ్యాడు. మా ఇద్ద‌రి కెరీర్ ఒకేలా వుంది. 2004లో నేను య‌జ్ఞం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేస్తే, అదే బేన‌ర్‌లో ర‌ణం చిత్రంతో త‌ను ద‌ర్శ‌కుడు అయ్యాడు. ఇద్ద‌రం మోతీ న‌గ‌ర్‌లోనే ఉంటాం. అమ్మ రాజ‌శేఖ‌ర్ క‌ష్ట‌జీవి. నేను అమ్మ‌దొంగ సినిమాకు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన‌ప్పుడు అమ్మ రాజ‌శేఖ‌ర్ డాన్స్ చేసేవాడు. నేను ద‌ర్శ‌కుడిగా సినిమా చేసిన‌ప్పుడు త‌ను డాన్స్ డైరెక్ట‌ర్‌గా నా సినిమాకు ప‌నిచేశాడు. త‌ను ఇంకా మంచి మంచి సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నాను. ఇందులో ప‌నిచేసిన అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు.

  అందుకే అమ్మ రాజ‌శేఖ‌ర్ ఫంక్ష‌న్ కోసం

  అందుకే అమ్మ రాజ‌శేఖ‌ర్ ఫంక్ష‌న్ కోసం


  అంద‌రినీ HI Five చేసే వ్య‌క్తి అమ్మ రాజ‌శేఖ‌ర్. త‌ను చాలా ఎన‌ర్జీగా ఉంటాడు. అందుకే టైటిల్ కూడా అలానే పెట్టాడు. హైస్కూల్‌లో నాకు సీనియ‌ర్. స్టేజీ ప్లేకూడా చేశాం. నేను ఓసారి హాస్పిటల్‌లో ఉంటే అమ్మ రాజ‌శేఖ‌ర్ వ‌చ్చాడు. మ‌నం బాధ‌గా ఉన్న‌ప్పుడు ప‌క్క‌నున్న‌వాడే మంచి ఫ్రెండ్‌. నాకు అలాంటిఫ్రెండ్ దొరికాడు. నేను తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. షూటింగ్ ఖ‌మ్మంలో ఉంది. అమ్మ రాజ‌శేఖ‌ర్ ఫంక్ష‌న్ కోసం వ‌ర్షం అయినా రావాల‌నిపించింది. అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు సురేష్ కొండేటి అండ‌గా ఉన్నాడు. నేను తెలుగులో కొత్త సినిమా చేస్తున్నా. అందులో సురేష్ కొండేటి ఓ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ HI Five సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అని ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్ అన్నారు.

  స‌ముద్రంలో వెళుతుంటే

  స‌ముద్రంలో వెళుతుంటే


  మా హైయ్ ఫైవ్ సినిమా అంద‌రూ బాగా ఎంజాయ్ చేసేలా వుంటుంది. చిన్న నిర్మాత‌ల‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలి. డైరెక్ట‌ర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్న‌ట్లు అమ్మ రాజ‌శేఖ‌ర్ ప్ర‌తి ప‌నిని ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. టెక్నీషియ‌న్స్‌ను అలెర్ట్ చేస్తారు. మేం ఓసారి స‌ముద్రంలో వెళుతుంటే మ‌ధ్య‌లో ఇంజ‌న్ ఆగిపోయింది. ఆ త‌ర్వాత కొన్ని చిన్న బోట్‌లు వ‌చ్చి మ‌మ్మ‌లి ఒడ్డున చేర్చాయి. అంద‌రినీ జాగ్ర‌త్త‌గా అమ్మ రాజ‌శేఖ‌ర్ చూసుకున్నారు. ఈ సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని చిత్ర నిర్మాత రాధా రాజ‌శేఖ‌ర్ అన్నారు.

  దివి, విశ్వ ఎమోషనల్‌గా

  దివి, విశ్వ ఎమోషనల్‌గా


  న‌టుడు విశ్వ, దివి వద్యా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ.. అమ్మ రాజ‌శేఖ‌ర్ అంద‌రినీ కుటుంబ స‌భ్యుల్లా చూసుకున్నారు. నేను మాస్ట‌ర్‌తో కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాకు డ‌బ్బులు రావాల‌ని ఆశిస్తున్నాను అని తెలిపారు.బిగ్‌బాస్ దివి మాట్లాడుతూ, ఈ సినిమా హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని అన్నారు.

  English summary
  Hi Five movie pre release event held at hyderabad which is directed by Amma Rajasekhar. Produced by Amma Rajasekhar wife Radha. Here is Jeevitha Rajasekhar, Surya Kiran emotional comments at Hi Five movie pre release event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X