బండ్ల గణేష్‌తో టైం వేస్ట్.. అన్నీ చీప్‌ ట్రిక్స్, వెలివేస్తారా? నీకు వచ్చిన కష్టమేంటంటూ జీవిత ఫైర్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం లో బండ్ల గణేష్- జీవిత మధ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ముందు నుంచి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చిన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ తన ప్యానల్ నుంచి జీవిత రాజశేఖర్ ని జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయిస్తారనే విషయం తెలియగానే ఆ ప్యానల్ కి గుడ్ బై చెప్పి తాను జీవిత పోటీ చేస్తున్న జనరల్ సెక్రటరీ పదవికి పోటీగా దిగుతున్నాను అని ప్రకటించాడు.. అయితే ప్రకటించిన సమయంలో మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు కానీ ఆమె అంటే నాకు నచ్చదు కాబట్టి ఆ పదవికి పోటీ దిగుతున్నా అని ప్రకటించాడు. అయితే ఈ విషయంలో తాజాగా జీవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

 పావులు కదిపి

పావులు కదిపి

వచ్చే నెల జరగబోయే టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఇప్పటినుంచే పెరుగుతోంది. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు డేట్ ప్రకటించక ముందు నుంచే దీనికి సంబంధించి రోజు ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ఎవరూ ఊహించని విధంగా నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయడంతో పాటు అతనికి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగడం ఆసక్తి రేపింది.. వీరితో పాటు అధ్యక్ష పదవికి జీవిత-రాజశేఖర్, నటి హేమ కూడా పోటీ చేయబోతున్నారనే వార్తలు వచ్చినా చివరికి ప్రకాష్ రాజ్ వారిని ఒప్పించి తన ప్యానల్ నుంచి పోటీ చేయించేలా పావులు కదిపారు.

 జీవిత మీద పరోక్షంగా విమర్శలు

జీవిత మీద పరోక్షంగా విమర్శలు

అసలు ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని బండ్ల గణేష్ ముందు నుంచి తాను సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ను సైతం వదలడానికి ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెనువెంటనే సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా జీవిత మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ఆ తర్వాత బండ్ల గణేష్ ని కొన్ని ఛానళ్లు ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూలో ఆమె మెగా ఫ్యామిలీని గతంలో ఎన్నోసార్లు చులకనగా మాట్లాడిందని, ఎన్నోసార్లు అవహేళన చేస్తూ మాట్లాడిందని చెబుతూ ఆ విషయంలో ఆమె నాకు నచ్చడం లేదు కాబట్టి ఆమె మీద పోటీ చేస్తానని ప్రకటించాడు.

బండ్ల గణేష్ కి ఏమైనా నష్టం వచ్చిందా

బండ్ల గణేష్ కి ఏమైనా నష్టం వచ్చిందా

అదే సమయంలో స్పందించిన జీవిత రాజశేఖర్ కూడా నాకు మెగా ఫ్యామిలీకి మధ్యనున్న గొడవలు గతంలో జరిగాయి కానీ ఇప్పుడు మేమందరం కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే బండ్ల గణేష్ తన పట్టు మాత్రం వీడడం లేదు. దీంతో జీవిత ఈరోజు జరిగిన ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తే వెలివేస్తారా? ఏంటి అని ప్రశ్నించిన ఆమె బండ్ల గణేష్ తన బతుకు గురించి మాట్లాడాడు అని అసలు తన గురించి బండ్ల గణేష్ ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. తాను పార్టీలు మారుతున్నాను అని బండ్ల గణేష్ అంటున్నాడని తాను పార్టీలు మారడం వల్ల బండ్ల గణేష్ కి ఏమైనా నష్టం వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు.

 డోంట్ కేర్‌

డోంట్ కేర్‌

బండ్ల గణేష్ అంటే నాకు డోంట్ కేర్‌ అని పేర్కొన్న ఆమె.. బండ్ల గణేష్‌ గురించి మాట్లాడడం టైం వేస్ట్.. అని అసలు 'మా' గురించి మాట్లాడకుండా చిరంజీవి ఇష్యూ ఎందుకు మాట్లాడటం? అని ఆమె ప్రశ్నించారు. బండ్ల గణేష్‌ చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారంటూ ఫైర్ అయిన జీవిత నా బతుకు గురించి బండ్ల గణేష్‌కు ఎందుకు? అని ఆమె ఫైర్ అయ్యారు.

Recommended Video

Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
వాళ్లందర్నీ వెలివేస్తారా?

వాళ్లందర్నీ వెలివేస్తారా?


పార్టీలు మారడం అనేది నా ఇష్టం అని పేర్కొన్న ఆమె ఒకే పార్టీలో ఉండి వెనుక గోతులు తవ్వితే గొప్పోడివా అంటూ ప్రశ్నించారు. మా ఆస్తులు అమ్ముకొని చేతనైనంత సహాయం చేశామన్న ఆమె.. మెగా ఫ్యామిలీని చాలా మంది విమర్శించి ఉంటారు.. వాళ్లందర్నీ వెలివేస్తారా? అంటూ నిలదీశారు. అంతే కాక విష్ణు పై తనకి ఎలాంటి వ్యతిరేకత లేదన్న ఆమె ప్రకాష్ రాజ్ గారు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోనే ఆయన ప్యానల్ లో చేరానని జీవిత అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X