twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా అశ్లీలతే.. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.. జీవిత సెన్సేషనల్ కామెంట్స్

    |

    నేటితరం సినిమాలు, వాటి తీరు ఎలా ఉంది? ఎలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు అనే అంశంపై జీవిత రాజశేఖర్ తనదైన రీతిలో రియాక్ట్ కావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు పింగ్ పాంగ్ సూర్య నిర్మిస్తున్న 'కలియుగ' మూవీ ప్రమోషనల్ సాంగ్ లాంచ్‌లో పాల్గొన్న జీవితా రాజశేఖర్.. ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని సినిమాలపై కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

    ఇదంతా చేస్తుంటే.. జీవిత ఆవేదన

    ఇదంతా చేస్తుంటే.. జీవిత ఆవేదన

    ఈ మధ్యకాలంలో ఓ సినిమాను ప్రమోట్ చేయడం కోసం విడుదలకు ముందుగా పోస్టర్స్, టీజర్స్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంచి అట్రాక్ట్ చేస్తున్నారని జీవితా రాజశేఖర్ పేర్కొంది. అశ్లీలత ఎక్కువ ఉండేలా పోస్టర్ విడుదల చేయడం ప్రమోషన్ ట్రిక్స్‌గా మారిందని, ఇదంతా చేస్తుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది జీవిత.

    శృతిమించి లిప్ లాక్స్, ఎక్స్‌పోజ్.. ఇదో పబ్లిసిటీ స్టంట్‌

    శృతిమించి లిప్ లాక్స్, ఎక్స్‌పోజ్.. ఇదో పబ్లిసిటీ స్టంట్‌

    శృతిమించి లిప్ లాక్స్, అమ్మాయిల ఎక్స్‌పోజ్ చూసిస్తూ పోస్టర్‌లు రిలీజ్ చేసి సినిమాని ప్రమోట్ చేసుకోవడం చూస్తున్నామని, ఈ అశ్లీలత సినిమాలో ఎంత ఉంటుందనేది పక్కనపెడితే.. పోస్టర్స్, టీజర్స్ మాత్రం అశ్లీలతతో నిండిపోతున్నాయని ఆమె పేర్కొంది. ఫిల్మ్ మేకర్స్ ఇదో పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటున్నారని ఆమె చెప్పింది. దీనిపై ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా, ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వీటిలో ఎంత వరకూ మార్పు వచ్చింది. ఆడ పిల్లలకు మనం ఎంత వరకూ సెక్యురిటీ ఇవ్వగలుగుతున్నాం. మన ఇంట్లో మన ఆడబిడ్డ వరకూ ఎంత స్వేచ్చ ఇస్తున్నాం. ఇవన్నీ గమనించుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తోందని జీవిత చెప్పుకొచ్చింది.

    ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం.. అందుకే

    ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం.. అందుకే

    ఇలాంటి వాటిని తలుచుకుంటే తన మీద తనకే అసహ్యం వేస్తుందని జీవిత తెలిపింది. ఇక సంతోషించాల్సిన విషయంలో ఏంటంటే ఇలాంటి వాటి నియంత్రించడంలో మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంది. ఆ ప్రయత్నంలో భాగమే ‘కలియుగ' సినిమా అని చెప్పింది జీవిత. ఈ సినిమా కాన్సెప్ట్ తనకు చెప్పడంతో తాను ప్రమోషన్‌లో పాల్గొన్నాని జీవిత తెలిపింది.

    ఇష్టంతోనే ఆయన ఈ ధైర్యం చేశాడు

    ఇష్టంతోనే ఆయన ఈ ధైర్యం చేశాడు

    కలియుక ప్రమోషనల్ వీడియో లాంచ్ చేసిన జీవిత.. తాను ఇక్కడికి రావడానికి కారణం పింగ్ పాంగ్ సూర్య అని ఆమె తెలిపింది. సూర్య మా ఇంట్లోని మనిషి. రాజశేఖర్ నటించిన ‘మా అన్నయ్య' సినిమాలో తమ్ముడిగా నటించాడు. ఈ రోజుల్లో సినిమా తీయడం ఆశామాషీ కాదు. మా లాంటి వాళ్లకే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సూర్య ‘కలియుగ' అనే సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. సినిమాపై ఉన్న ఇష్టంతోనే ఆయన ఈ ధైర్యం చేశాడని తెలిపింది జీవిత. అతను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ.. ఇది కమర్షియల్‌గా ఉండేలా కామెడీ, లవ్, రొమాంటిక్ అని ఏదో రకంగా ప్రమోట్ చేసుకోవాలని అనుకోలేదని ఆమె పేర్కొంది.

    English summary
    Senior Actress Jeevitha commented latest movie teasers and posters. She Released Kaliyuga promotional video and she says about present situation in tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X