జీవితతో నా వల్ల కాదన్న రాజశేఖర్.. ఆ రోజు ఏం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు దశాబ్థాలుగా మూల స్తంభాలుగా నిలిచిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్‌ వెండితెరను దున్నేస్తున్న సమయంలో తమిళనాడు నుంచి వచ్చి సంచలన విజయాలు సాధించారు డాక్టర్ రాజశేఖర్. తాము డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యామంటూ పలువురు నటులు చెబుతారు. కానీ మెడిసిన్ చదివి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లక్షలాది మంది అభిమానులను సంపాదించారు రాజశేఖర్.

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్‌మెన్‌గా, విలక్షణ నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 90వ దశకంలో పోలీస్ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు రాజశేఖర్. తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఎంతో మంది యువత పోలీస్ యూనిఫాం ధరించేందుకు ప్రేరణగా నిలిచారు. యాక్షన్ సినిమాలే కాదు, ఫ్యామిలీ, రొమాంటిక్, లవర్ బాయ్‌గానూ రాజశేఖర్ తనలోని విలక్షణ నటుడిని పరిచయం చేశారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ 60 ఏళ్ల వయసులోనూ దూసుకెళ్తున్నారు.

Jeevitha was rejected by Rajasekhar as the heroine during the shooting of a film

రాజశేఖర్ పని అయిపోయింది అంటూ విమర్శలు వచ్చిన ప్రతిసారి సాలీడ్ హిట్‌తో బౌన్స్ బ్యాక్ అవ్వడం ఆయన స్టైల్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన పీఎస్‌వీ గరుడవేగతో మంచి హిట్ అందుకున్న ఆయన.. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ విజయం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటించారు. ఇది పర్వాలేదు అనిపించుకుంది. ఆ వెంటనే అర్జున, దెయ్యం, శేఖర్, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలు చేశారు. కానీ ఇవి ఆశించిన విజయం అందించలేదు. 2023 తర్వాత గడిచిన రెండేళ్లుగా ఆయన కొత్తగా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

సినిమాలలో తనకు హీరోయిన్‌గా నటించిన నాటి టాప్ హీరోయిన్ జీవితను ప్రేమించి పెళ్లాడారు రాజశేఖర్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. శివాత్మిక రాజశేఖర్, శివానీ రాజశేఖర్. వీరు కూడా తల్లిదండ్రుల బాటలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి స్థిరపడే పనిలో ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీనటుల్లో రాజశేఖర్ - జీవిత జంట కూడా ఒకటి. దాదాపు 3 దశాబ్ధాలుగా వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జీవిత తన భర్త, పిల్లల కోసం కెరీర్‌ను త్యాగం చేసి కుటుంబానికి అండగా నిలిచారు.

అలాంటి జీవితను రాజశేఖర్ తనకు తానుగా హీరోయిన్‌గా వద్దు అంటూ తీసి వేయించారట. తలంబ్రాలు సినిమాలో తొలిసారి జీవిత, రాజశేఖర్‌లు కలిసి నటించారు. కానీ అంతకంటే ముందే తమిళంలో హాలో యార్ పెసురతు అనే సినిమాలో రాజశేఖర్, జీవితలను ఎంపిక చేశారు ఆ చిత్ర దర్శకుడు రామరాజన్. అయితే ఓ రోజున జీవిత షూటింగ్‌కు జ్వరంతో వణికిపోతూ వచ్చింది. రాజశేఖర్ స్వతహాగా డాక్టర్ కావడంతో వెంటనే ఆమెకు ట్రీట్‌మెంట్ చేశారు.

Jeevitha was rejected by Rajasekhar as the heroine during the shooting of a film

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గ్లామర్ షో చేయాల్సి ఉంటుందని, జీవిత చాలా పద్ధతిగా కనిపిస్తున్నారని ఆమెను ఇందులో నుంచి తీసేయమని చెప్పారట రాజశేఖర్. దీనిపై దర్శక నిర్మాతలు చర్చించుకుని రెండ్రోజుల తర్వాత షూటింగ్ ఉంటుందని కారు పంపిస్తామని రాజశేఖర్‌తో చెప్పారట. కానీ ఎన్ని రోజులైనా బండి రాకపోగా.. ఏం జరిగిందని వాకబు చేస్తే హీరోయిన్‌గా జీవితను కంటిన్యూ చేసి రాజశేఖర్‌ను తప్పించి అతని ప్లేస్‌లో సురేష్‌ను తీసుకున్నారట. దీంతో షాక్ అవ్వడం రాజశేఖర్ వంతైంది.

More from Filmibeat

Read more about: jeevitha dr rajasekhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X