హలీవుడ్ డైరెక్టర్‌ను పట్టేసిన మంచు విష్ణు.. కాజల్‌ను ఇప్పటికే..
టాలీవుడ్ హీరో మంచు విష్ణు రూపొందిస్తున్న హాలీవుడ్ సినిమా పనులు వేగం పుంజుకొన్నాయి. ఇప్పటికే బ్యూటీ కాజల్ అగర్వాల్‌ను రంగంలోకి దించిన విష్ణు తాజాగా సినిమా డైరెక్టర్‌ను కూడా లైన్లో పెట్టారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జెఫరీ జీ చిన్ డైరెక్షన్ చేయబోతున్నాడు.
జెఫరీ జీ చిన్ గురించి ప్రస్తావిస్తే.. హాలీవుడ్, హైనాలో ఫిక్షనల్ డ్రామాలు, డాక్యుమెంటరీలు నిర్మించి ఆకట్టుకొన్న ఘనత ఉంది. అంతేకాకుండా యూఎస్‌సీ స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ ఇన్ డైరెక్టింగ్‌లో మాస్టర్ డిగ్రీ పుచ్చుకొన్నాడు. అలాంటి డైరెక్టర్‌కు విష్ణు చెప్పిన కథ విన్న వెంటనే ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవ్వడానికి ముందుకొచ్చారట.

త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాలను ఎంపిక చేసి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు, నటీనటులు ఎంపిక, బడ్జెట్ తదితర అంశాలపై విష్ణు కసరత్తు చేస్తున్నారు. స్క్రిప్టు, ఇతర యూనిట్ సభ్యుల ఎంపిక పూర్తికాగానే సెట్స్‌పైకి ఈ సినిమాను తీసుకెళ్లే పనిలో ఉన్నాడు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
మంచు విష్ణు రూపొందించే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం కాజల్ అగర్వాల్ దేశీయంగా ఫ్యాన్సీ ఆఫర్లను వదులుకొన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఇండియన్ 2 సినిమా నుంచి బయటకు వచ్చి కమల్ హాసన్‌కు ఝలక్ ఇచ్చారట. శంకర్, కమల్ హాసన్ రూపొందించే సినిమా ఇండియన్ 2 కోసం చాలా రోజులు నిరీక్షించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











