హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన జెర్సీ బ్యూటీ .. ఆ మూవీలో కథే లేదంటూ, హీరో ముందే షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ కి ఎలాంటి కొదవ ఉండదని చెప్పాలి. మన తెలుగు హీరోయిన్స్ లో కొందరు ఎంతో బాగున్నప్పటికీ మనకి పక్క స్టేట్స్ నుంచి హీరోయిన్స్ ని తీసుకొచ్చుకొని భారీ రెమ్యునరేషన్ లు కూడా ఇచుకుంటాం. ఇదెప్పుడు నిరంతరం నడిచే ప్రక్రియే అయితే కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ లో వచ్చి మంచి డెబ్యూ కూడా అందుకున్నప్పటకీ అందరి లానే వరుస ఆఫర్స్ రావడం అనేది జరగదు.
కేవలం కొందరు మాత్రమే తమ ప్రైమ్ టైంని యూజ్ చేసుకొని కొంత కాలంలోనే బాగా సెటిల్ అయిపోతారు. మరి ఇండస్ట్రీలోకి వచ్చి మంచి డెబ్యూ అందుకున్నప్పటికీ కూడా తక్కువ సినిమాలే చేస్తున్న హీరోయిన్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ కూడా ఒకామె అని చెప్పాలి.

శ్రద్ధా శ్రీనాథ్ .. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ చిత్రం "జెర్సీ" తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమెకి సాలిడ్ రోల్ కూడా దక్కింది . కానీ ఈ చిత్రం తర్వాత తెలుగులో శ్రద్ధకి మరీ ఎక్కువ ఆఫర్స్ ఏమీ వచ్చేయలేదు. అలాగే చిన్న ఆఫర్స్ కూడా రాలేదని చెప్పొచ్చు. నిజానికి శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో 2019 లో పరిచయం కాగా దీనికి ముందే అప్పట్లోనే మరో తెలుగు సినిమా ఆఫర్ ని ఆమె వదులుకుందట.
అంటే దాదాపు జెర్సీ తో సమానంగానో లేక జెర్సీ కంటే ముందే తెలుగులో ఆమె మొదటి సినిమా చేయాల్సి ఉంది. కానీ దానిని ఆమె రిజెక్ట్ చేసినట్టుగా అసలు విషయాన్ని రీసెంట్‌గా రివీల్ చేసింది. ఆ సినిమా ఏదో కూడా కాదు మాస్ హిట్ చిత్రం "ఫలక్ నామా దాస్" అట. యువ హీరో విశ్వక్ సేన్ ని మాస్ కా దాస్ గా మార్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటిగా శ్రద్ధా శ్రీనాథ్ ని అనుకున్నారట.

కానీ ఈమె ఈ సినిమా కథ నచ్చక తిరస్కరించాను అని ఓపెన్ గా చెప్పేసింది. ఆ కథలో నాకేమి పెద్దగా ఎగ్జైటింగ్ గా కనిపించలేదు అందుకే వద్దు అనేశాను అని లేటెస్ట్ గా అసలు విషయాన్ని రివీల్ చేసింది. మరి ఆ సినిమా వదులుకున్న ఈ యువ హీరోయిన్ ఆ సినిమా తర్వాత ఇపుడు విశ్వక్ సరసన రొమాన్స్ చేసింది.
విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ "మెకానిక్ రాకీ" సినిమాలో ఒక హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే విశ్వక్ తో ఛాన్స్ వచ్చినప్పటికీ చేయలేదు అని ఇపుడు చేసినట్టుగా వెల్లడించింది. సో అప్పట్లోనే రెండు హిట్ సినిమాలు ఆమెకి పడాల్సి ఉంటే వాటిలో ఒక క్లాసిక్ సినిమాని మాత్రం ఆమె ఎంచుకుంది అని చెప్పాలి. మరి ఇపుడు మెకానిక్ రాకీ లో శ్రద్థా శ్రీనాథ్ ఎలా అలరిస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











