మరో తెలుగు సినిమా రీమేక్‌కి రంగం సిద్ధం.. దిల్ రాజు, అల్లు అరవింద్ ఏకమై భారీ రేంజ్‌లో ప్లాన్

టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరుగుతోంది. తెలుగు దర్శకుల దర్శకత్వ ప్రతిభకు బీ టౌన్ ప్రేక్షక లోకం ఫిదా అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు దర్శకులు చేస్తున్న సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతుండం, భారీ సక్సెస్ సాధిస్తుండటం ఇందుకు సరైన ఉదాహరణ.

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమా ఇటీవలే 'కబీర్ సింగ్' రూపంలో రీమేక్ కాబడి ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే తన మాస్టర్ వర్షన్ 'అర్జున్ రెడ్డి'కి కబీర్ సింగ్ రూపమిచ్చారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించి భేష్ అనిపించుకున్నాడు. అయితే తాజా మరో తెలుగు సినిమా రీమేక్ కోసం అదే షాహిద్ కపూర్ రెడీ అయ్యాడు.

Jersey Hindi Remake Update

తెలుగులో నాని హీరోగా వచ్చి భారీ సక్సెస్ సాధించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. అందరూ ఊహించినట్లుగానే ఇందులో ఇందులో షాహిద్ క‌పూర్‌ హీరోగా నటించబోతున్నాడు. చిత్ర నిర్యాణం కోసమై టాలీవుడ్ బడా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ ఏకమయ్యారు.

దిల్ రాజు, అల్లు అరవింద్‌తో పాటు బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్‌తో కలిసి జెర్సీ రీమేక్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రీమేక్ కి మాస్టర్ సినిమా 'జెర్సీ'కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరియే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. ఈ రీమేక్ సినిమాను ఆగస్టు 28వ తేదీ 2020 సంవత్సరంలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అతి త్వరలో హీరోయిన్, ఇతర వివరాలు తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X