సెన్సార్ పూర్తి చేసుకున్న జెర్సీ.. ఆర్ యు రెడీ అంటున్న నాని!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు అర్జున్. ఇటీవల విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఎప్పటిలాగే నాని ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. ప్రేమ, పెళ్లి, క్రికెట్ అంశాల చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.
ఇదిలా ఉండగా ఈ శుక్రవారం జెర్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెర్సీ చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని సిద్ధం అయింది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగిశాయి. సెన్సార్ సభ్యులు జెర్సీ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జరీ చేశారు. దీనితో నాని 'ఆర్ యు రెడీ' అంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు.

ఈ చిత్రంలో నాని సరసన శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. సోమవారం రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెర్సీ చిత్రం తన కెరీర్ లో గుర్తుంచుకొదగ్గ చిత్రంగా మిగిలిపోతుందని నాని తెలిపాడు. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











