జెర్సీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. నాని కోసం ఉత్కంఠగా!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు అర్జున్. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్ విడుదలకు కూడా ముహూర్తం ఖారైపోయింది. నానిని క్రికెటర్ పాత్రలో చూడాలని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఏప్రిల్ 12న ఉదయం 9:09 గంటలకు జెర్సీ థియేట్రికల్ ట్రైలర్ విడుదుల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జెర్సీ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. అర్జున్ విజయ యాత్ర ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం అవుతుంది అంటూ చిత్రయూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ట్రైలర్ విడుదల సమయాన్ని ప్రకటిస్తూ నాని గట్టిగా అరుస్తున్న పోస్టర్ ని విడుదల చేశారు.

జెర్సీ చిత్రంలో నానికి జోడిగా శ్రద్దా శ్రీనాధ్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ జెర్సీ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత ఏడాది నాని నటించిన దేవదాస్, కృష్ణార్జున యుద్ధం చిత్రాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం నాని జెర్సీపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











