జెర్సీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు అర్జున్. ఇటీవల విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఎప్పటిలాగే నాని ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు.
ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసిందిని చెప్పొచ్చు. ప్రేమ, పెళ్లి, క్రికెట్ అంశాల చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. జెర్సీ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జెర్సీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 15న శిల్పకళా వేదికలో జెర్సీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వైభవంగా నిర్వహించబోతున్నారు.

మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. జెర్సీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఇక వెంకటేష్ క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలు చిక్కినప్పుడల్లా వెంకీ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ఇష్టపడతారు.


Click it and Unblock the Notifications











