Jigarthanda Double X Movie Twitter Review ధనుష్ రివ్యూ ట్రెండింగ్.. జిగర్తాండ మూవీ ఎలా ఉందంటే?
తమిళంలో క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్, దర్శకుడు ఎస్‌జె సూర్య హీరోలుగా నటించిన హై యాక్షన్ డ్రామా జిగర్ తండ డబుల్ ఎక్స్. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీపావళి సందర్బంగా ఈ మూవీ నవంబర్ 10న రిలీజైంది. ఈ సందర్బంగా నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన సినిమా అభిప్రాయాల్లోకి వెళితే..

తెలుగు సినిమా దత్త పుత్రుడు లారెన్స్ మాస్టర్ మా విషెస్. మల్టీ టాలెంటెండ్ డైరెక్టర్ ఎస్ జే సూర్యకు నా అభినందనలుు. జపాన్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. కార్తీక్ సుబ్బరాజుకు సక్సెస్ లభించాలి అంటూ కామెంట్ చేశారు
జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను. తైవలర్, కమల్ హాసన్ రెఫరెన్స్ తీసుకొన్న కార్తీక్ సుబ్బరాజు నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు. మీ అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయం లభించాలి. జిగర్తాండ టీమ్‌కు నేను ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. కార్తీక్ సుబ్బరాజ్, ఎస్‌జే సూర్య, సంతోష్ నారాయణన్, కెప్టెన్ మిల్లర్, ధనుష్ రాజాకు కంగ్రాట్స్ అని నెటిజన్ కామెంట్ చేశారు
జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా రిలీజ్ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. లారెన్స్ రాఘవ, సూర్య, కార్తీక్ సుబ్బరాజు, సంతోష్ నారాయణన్, ప్రవీణ్ రాజా తదితరులు విషెస్ తెలిపారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ భారీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా గురించి మంచి టాక్ వినిపిస్తున్నది. 4 ఏళ్ల తర్వాత కార్తీక్ సుబ్బరాజు వస్తున్నారు. ప్రతీ ఒక్కరికి నా విషెస్ తెలియజేస్తున్నాను అని అనిరుధ్ ట్వీట్ చేశాడు.
జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూను సూపర్ స్టార్ ధనుష్ ట్విట్టర్‌లో ధనుష్ పోస్టు చేశాడు. నేను జిగర్దాండ చూశాను. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను అద్బుతంగా తీశాడు. ఎస్జే సూర్య ఎప్పటి మాదిరిగానే ఇరగదీశారు. లారెన్స్ రాఘవను కొత్తగా చూస్తాం. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ బ్యూటీ. 40 నిమిషాలు సినిమా మీ మదిని దోచుకొంటుంది. చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు అని ధనుష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











