పొలిటికల్ థ్రిల్లర్‌గా ‘జోహార్’... 5 పాత్రలు, 4 కథలు, ఒక నిర్ణయం!
ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మాతగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా 'జోహార్. 'దశ్యం' చిత్రంలో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. 'వంగవీటి' ఫేమ్ నైనా గంగూలీ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ''నేను ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద 'వంగవీటి' చిత్రానికి దర్శకత్వ శాఖ, రచయిత విజయేంద్ర ప్రసాద్ వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్‌గా నా తొలి చిత్రమిది. 'జోహార్' చిత్రం పొలిటికల్ సెటైర్‌గా, ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అన్నారు.

ఈ చిత్రం ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. 5 పాత్రలు, 4 కథలు, ఒక నిర్ణయం ఇలా విభిన్నంగా సినిమా నడుస్తుంది. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. 'భైరవగీత' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. త్రిష 'నాయకి', 'భైరవగీత' చిత్రాలకు వర్క్ చేసిన జగదీశ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్యప్రసాద్ పాటలు రాశారు. 'రాక్షసుడు', 'జార్జిరెడ్డి' చిత్రాలకు పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు'' అని దర్శకుడు అన్నారు.
తనదైన నటనతో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌లాంటి పాత్రలో నటించారని, రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు వెల్లడించారు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ధర్మ సూర్య పిక్చర్స్, నిర్మాత: భాను సందీప్ మార్ని, దర్శకత్వం: తేజ మార్ని, కెమెరా: జగదీశ్ చీకటి, మ్యూజిక్: ప్రియదర్శన్, ఎడిటింగ్: సిద్ధార్థ్ తాతోలు, ఆర్ట్: గాంధీ, పాటలు: చైతన్య ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ బిక్కిన , కల్యాణ్.ఎం, రాఘవేంద్ర చౌదరి,


Click it and Unblock the Notifications











