twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాపై పోరాటంలో నిజమైన యోధులు వారే.. జాన్ అబ్రహం

    |

    బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం దేశభక్తి ఎక్కువే. నిర్మాతగా మారి ఆయన రూపొందించిన చిత్రాలు సత్యమేవ జయతే, పరమాణు: ది స్టోరి ఆఫ్ పోఖ్రాన్ సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్ నటులు స్పందించి వివిధ పద్దతుల్లో ఆర్థిక, ఇతర రూపంలో సహాయం అందిస్తున్నారు. ప్రధాని ప్రత్యేక నిధి, మహారాష్ట్ర సీఎం నిధికి విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

    అయితే జాన్ అబ్రహం మాత్రం ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకొని ఆర్థికంగా అండగా నిలువాలని అనుకొన్నారు. అయితే ఏ మొత్తంలో విరాళం అందించే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తన సహాయంపై స్పందిస్తూ.. చాలా మంది ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం అందించినందుకు చాలా థ్యాంక్స్. నేను ఎంత ఇచ్చాననే విషయం, ఎవరికి ఇచ్చాననే విషయం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. జాన్ అబ్రహం ఇది చేశాడు. ఇలా చేశాడనే విషయం ఇతరులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ప్రజలకే నేరుగా చెప్పాలనుకొంటున్నాను అని జాన్ పేర్కొన్నారు.

    John Abraham keep Secrecy about donation for Corona Crisis

    ప్రాణాంతక వ్యాధి కరోనాపై పోరాటానికి సిద్ధమైన పోలీసులు, ఆర్మీ, మెడికల్ సిబ్బంది నిజమైన యోధులు. వారి ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేం అని జాన్ చెప్పారు.

    కరోనా పరిస్థితులు నా జీవితంలో పెద్దగా మార్పులు ఏమీ తీసుకురాలేదు. హోం ఫుడ్, ఇంట్లోనే కంఫర్టబుల్‌గా ఉన్నాను. మే 4 తర్వాత పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటే అందరూ ఆనందంలో తమ పనుల్లో భాగమవుదామని చూస్తున్నారు అని జాన్ పేర్కొన్నారు.

    English summary
    Bollywood star John Abraham keep Secracy about donation for Corona Crisis. Unlike his peers in Bollywood, John Abraham has not disclosed the amount he has donated for coronavirus relief.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X