‘సలార్’లో బాలీవుడ్ హీరో: ప్రభాస్‌తో తలపడేందుకు బడా స్టార్‌నే పట్టేశారుగా!
కొన్నేళ్లుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం అతడు నటిస్తోన్న 'రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే.. మరిన్ని చిత్రాలను ప్రకటించాడతను. అందులో 'కేజీఎఫ్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న 'సలార్' కూడా ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. భారీ లెవెల్‌లో రూపొందనున్న 'సలార్' సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను తీసుకున్నారట. ఎన్నో హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన అతడు.. ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు రెడీ అన్నాడని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ హీరో పాత్రను ఎంతగా ఎలివేట్ చేస్తాడో.. విలన్ రోల్‌ను కూడా అదే రీతిలో హైలైట్ చేస్తాడన్న విషయం తెలిసిందే. అందుకే ఈ పాత్రకు జాన్ ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అతడు 'సలార్'లోనే నటించనున్నాడని అంటున్నారు. వాస్తవానికి అతడు దీని కంటే ముందే నాగ్ అశ్విన్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో ఇదే అన్నింటి కంటే ముందు మొదలవుతుందని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. కేజీఎఫ్‌తో నేషనల్ ఫిగర్ అయిన అతడు.. ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతాడన్న దానిపై ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











