జొన్నవిత్తుల అన్నంత పని చేశాడు.. ఆర్జీవీకి కొత్త అర్థం.. వర్మ బండారం బజారుపాలేనా?

రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వ రావును బాగానే కదిలించాయి. వర్మపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయనపై ఓ బయోపిక్ తీస్తానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ మాటలు కేవలం కోపంలోనే అన్నాడని, వర్మ బయోపిక్ అనేది చేతల్లో కనబడదని అంతా అనుకున్నారు. కానీ జొన్నవిత్తుల అన్నంత పని చేశాడు. బయోపిక్ టైటిల్ కూడా ప్రకటించాడు. అసలు వీరి మధ్య గొడవ ఎలా ఎందుకు మొదలైందో ఓ సారి చూద్దాం.

టీవీ చర్చల్లో భాగంగా..

టీవీ చర్చల్లో భాగంగా..

రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ చానెళ్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో సదరు యాంకర్ ఫోన్‌లో జొన్నవిత్తుల అభిప్రాయాన్ని కోరింది. అంతా విన్న యాంకర్.. ఆర్జీవీని తన అభిప్రాయం చెప్పమని కోరింది. అప్పటి వరకు అదంతా పట్టనట్టు సెల్‌ఫోన్ చూస్తు ఉన్న ఆర్జీవీ తానేమీ వినలేదని చెప్పుకొచ్చాడు.

అక్కడితో కథ మొదలు..

అక్కడితో కథ మొదలు..

ఆ మాటతో జొన్నవిత్తుల ఊగిపోయాడు. అంత నిర్లక్ష్యమేంటీ అంటూ వర్మపై ఊగిపోయాడు. ఇంత తెలివి, ఆలోచన ఉండి వాటిని బూడిదలో పోసిన పన్నీరులా చేసేవాడే అసలైన పప్పు.. వర్మ ఒక అంతర్జాతీయ పప్పు.. తనకు చౌదరి అనే బిరుదు ఇచ్చాడని.. దాన్ని తాను స్వీకరిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. తాను కూడా పప్పు వర్మ అంటూ ఓ బిరుదు ఇస్తున్నానని తెలిపాడు.

జీవశ్చవంలా బతుకుతున్నావ్

జీవశ్చవంలా బతుకుతున్నావ్

చాగంటి కోటేశ్వరావు గురించి అమర్యాదగా మాట్లాడిన వర్మపై జొన్నవిత్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అనుసరించే వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు.. అలాంటి ఆయన్ను అనడానికి నీ బతుకెంత? నీకు సంప్రదాయమనే చిప్ లేదు.. గొప్పవాడివి, మేధావి అని అనుకుంటున్నావ్.. నీ పిశాచ భావజాలంలో ఫిలాసఫర్ అనుకుంటో అనుకో మాకు సంబంధం లేదు.. నీ బురద అంతా ఇళ్లల్లోకి గుళ్లల్లోకి వస్తోంది.. ఖబర్దార్.. నువ్వు ఎందుకు పనికి రావు.. చివరకు నీ మీద సానుభూతి కూడా ఎవ్వరూ చూపించే పరిస్థతి లేదు..జీవశ్చవంలా బతుకుతున్నావ్ అంటూ ఉతికి ఆరేశాడు.

ఆర్జీవీపై బయోపిక్..

ఆర్జీవీపై బయోపిక్..

ఓ ఛార్లీ చాప్లిన్.. హిట్లర్‌ను పేరడీ చేస్తూ గ్రేట్ డిక్టేటర్ ఎలా తీశాడో..మోడ్రన్ టైమ్స్ ఎలా తీశాడో.. ఆ స్థాయిలో రాస్తాను. ఎన్నెన్ని కోణాల్లో ఎంత దుర్మారంగా ఆలోచిస్తావో.. నీ పిచ్చి ఆలోచనలు వెకిలీ సెటైర్లు.. ఎన్ని అనర్థాలకు దారి తీస్తున్నాయో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువకులపై దుష్ప్రభావాన్ని చూపుతుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తానంటూ చెప్పుకొచ్చాడు.

పిరికిపందవి, దద్దమ్మవి

పిరికిపందవి, దద్దమ్మవి

వర్మను పప్పు అనడానికి వెయ్యి కారణాలు చూపిస్తానని జొన్నవిత్తుల అన్నాడు. ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీసింది కాదంటాడు..దమ్ము ధైర్యం ఉంటే మీ గురించే తీశానని చెప్పాలంటూ సలహా ఇచ్చాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న వారిని పెట్టి మళ్లీ వారి గురించి సినిమా తీయలేదని అంటున్నావ్.. పిరికిపందవి, దద్దమ్మవి అంటూ ఆర్జీవీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.

దశాబ్దానికోసారైనా..

దశాబ్దానికోసారైనా..

ఇలా జొన్నవిత్తుల రెచ్చిపోగా.. వర్మ కూడా తన స్టైల్లో స్పందించాడు. ‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్ , నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీ తో ఎంజాయ్ చెయ్యి బేబీ, లేకపోతే ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతావ్ జొన్నా , నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్ . . వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్,కానీ ఐ లవ్ యు డా అంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేశాడు.

Recommended Video

Megastar Chiranjeevi Emotional Message To People
రోజూ గిల్లే వాడు..

రోజూ గిల్లే వాడు..

తాజాగా ఆర్జీవీ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. అయితే ఈ ఆర్జీవీనే వర్మ అని అందరికీ తెలిసినా.. అందులో కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు. ఆర్జీవీ అంటే రోజూ గిల్లే వాడు అని సబ్ టైటిల్‌గా వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతోందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X