twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV - రోజూ గిల్లే వాడు.. టైటిల్ పోస్టర్ రిలీజ్.. వర్మపై జొన్నవిత్తుల సెటైర్

    |

    గత కొద్దికాలంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, స్టార్ రైటర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం సందర్భంగా జరిగిన ఓ టెలివిజన్ డిబేట్ సందర్భంగా వర్మ, జొన్నవిత్తుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఆ సందర్భంగా వర్మ తీరుపై సెటైరిక్‌గా సినిమా తీస్తానని జొన్నవిత్తుల శపథం చేశారు. అలాంటి క్రమంలోనే వస్తున్న చిత్రం RGV.

    RGV ఫస్ట్‌లుక్ పోస్టర్

    RGV ఫస్ట్‌లుక్ పోస్టర్

    శ్రీరామ నవమి పండుగ సందర్భంగా RGV సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినికార్ప్ సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి 'RGV' చిత్రg రూపొందింది. టైటిల్ లోగో విడుదల మరియు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ది 02-04-2020న మీడియా వారికి విడుదల చేయడం జరిగింది

     పెడదోవ పట్టిస్తున్న ఆర్జీవి

    పెడదోవ పట్టిస్తున్న ఆర్జీవి

    ఈ సందర్భంగా దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ 'తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు' తన పిచ్చి ఇజంతో యువతను పెడదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని, అందుకే "శ్రీరామనవమి" పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు.

    కుహానా మేధావి

    కుహానా మేధావి

    చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు.

     నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటలు: సురేష్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు.
    సాంకేతికనిపుణులు:
    ఛాయాగ్రహణం : వేదాంత్ మల్లాది
    కూర్పు : కార్తీక శ్రీనివాస్
    కళ : కృష్ణ చిత్తనూర్
    పబ్లిసిటీ : ధనీ ఏలే
    సంగీతం : వీణాపాణి
    సమర్పణ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
    నిర్మాత : బాల కుటుంబ రావు పొన్నూరి
    కధ, మాటలు, పాటలు, చిత్రానువాదం మరియు దర్శకత్వం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

    English summary
    RGV Roju Gille Vadu movie poster released on the eve of Rama Navami festival. Which Directed by writer Jonnavittula Rama Lingeshwara Rao on Ram Gopal Verma satirical biopic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X