For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జర్నలిస్టుగా బాధ్యతగా, బాధతో రాంగ్ గోపాల్ వర్మ రూపొందించా: దర్శక, నిర్మాత ప్రభు

    |

    ఇటీవల కాలంలో ఓ ప్రముఖ దర్శకుడి తీరుపై తెలుగు సినీ పరిశ్రమలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పలు సినిమాలు వస్తున్నాయి. మరికొన్ని ఆయనకు అనుకూలంగా కూడా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న చిత్రం రాంగ్‌ గోపాల్ వర్మ. ఈ చిత్రానికి సినీయర్ జర్నలిస్టు ప్రభు దర్శకత్వం వహించారు. రాంగ్ గోపాల్ వర్మ చిత్రం మోషన్ పోస్టర్, టైటిల్ సాంగ్, టీజర్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ చేపడుతూ నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు షకలక శంకర్, జబర్దస్త్ అభి, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్, ఛాయాగ్రాహకుడు బాబుతోపాటు సినీయర్ జర్నలిస్టులు వినాయకరావు, సురేష్ కొండేటి పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా జర్నలిస్టు, దర్శక, నిర్మాత ప్రభు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఓ దర్శకుడి వింత పోకడలకు, వెర్రి చేష్టలకు విసిగిపోయి వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని తెరకెక్కించాను అని తెలిపారు.

    Journalist Prabhu about Rang Gopal Varma movie

    జర్నలిస్ట్ గా పలు సంచనాలు సృష్టించిన ప్రభు 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రంతో దర్శకుడుగానూ సంచలనాలకు శ్రీకారం చుట్టాలని వినాయకరావు, సురేష్ కొండేటి ఆకాక్షించారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రాల్లో "రాంగ్ గోపాల్ వర్మ" ఒకటని షకలక శంకర్ అన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుకు... సంగీత దర్శకుడు షకీల్, ఛాయాగ్రాహకుడు బాబు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రభు థాంక్స్ చెప్పారు. ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు!

    English summary
    Wrong Gopal Varma Audio released by Tammareddy Bharadwaja and KL Damodar Prasad on eve of Pawan Kalayn's birthday. Wrong Gopal Varma poster released which directed by Senior Journalist Prabhu. Popular comedian Shakalaka Shankar is playing lead role in the film. This is satirical film on the popular directors behaviour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X