నా శత్రువుల వల్లే నాకు ఈ స్థితి.. అలా ఉంటే పతనం.. సురేష్ కొండేటి
సంతోషం సినిమా అవార్డులు, ఓటీటీ అవార్డులను ఘనంగా నిర్వహిస్తున్నట్టు జర్నలిస్టు, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి ప్రకటించారు. నవంబర్ 18వ తేదీన హైదరాబాద్‌లో ఓటీటీ అవార్డులు, డిసెంబర్ 3వ తేదీన గోవాలో సంతోషం 21వ వార్షిక అవార్డులను నిర్వహిస్తున్నట్టు పత్రికా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెల్లడిస్తూ..
నిర్మాతగా ప్రొడక్షన్ వ్యవహారాలు కొంత స్లో అయ్యాయి. మళ్లీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాను. యాక్టర్‌గా నాలుగు సినిమాలు చేస్తున్నాను. మాయ సినిమాలో గోపాల గోపాల సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ మాదిరి పాత్రలో నటిస్తున్నారు. సీఎం పెళ్లాం సినిమాలో హోం మినిస్టర్‌గా, అమ్మ రాజశేఖర్ సినిమాలో ఓ క్యారెక్టర్, ఇంకా కొన్ని సినిమాల్లో ఇంపార్టెంట్ పాత్రలు పోషిస్తున్నాను. ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో కనిపిస్తాను అని సురేష్ కొండేటి చెప్పారు.

జర్నలిస్టుగా కొనసాగిస్తూనే అన్ని పనులు కొనసాగిస్తాను. నిర్మాతగా, నటుడిగా, అవార్డుల నిర్వాహకుడిగా నా పనులు చేసుకొంటూ వెళ్తాను. జర్నలిస్టు అసోసియేషన్‌కు, మా అసోసియేషన్‌కు కీలకంగా వ్యవహరిస్తున్నాను అని సురేష్ తెలిపారు.
నాపై వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోను. ఒకడు ఎదుగుతున్నాడంటే.. మనలో కొందరు కిందికి లాగే ప్రయత్నం చేస్తుంటారు. నా శత్రువులే నా ఎదుగుదలకు కారణం. నా శత్రువులే నాకు దేవుళ్లు. నా సీనియర్ జర్నలిస్టులు నన్ను తొక్కేందుకు ప్రయత్నించారు. ఆ బాధ నన్నే ఇంత వరకు తీసుకొచ్చింది. నా ఎదుగుదలకు తోడ్పాటు అందించింది. నన్ను పొగిడే వాళ్లు ఉంటే.. మన పతనానికి నాంది అని నేను అనుకొంటాను అని సురేష్ కొండేటి అభిప్రాయపడ్డారు.

యూట్యూబ్‌లో నా వీడియోలు వైరల్ కావడంతో నన్ను అభిమానించే వాళ్లు కూడా పెరిగిపోతున్నారు. నాకు అందరి హీరోల అభిమానుల నుంచి స్పందన లభిస్తున్నది. నాకు ఇది నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. నేహా శెట్టిని ప్రశ్న అడిగితే ట్రోల్ చేశారు. ఆ తర్వాత నాకు ఆమె క్లోజ్ అయ్యారు. నాతో చాలా మంది హీరోయిన్లు చాలా క్లోజ్‌గా ఉంటారు అని సురేష్ కొండేటి చెప్పారు.

గతంలో నాకు రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల పాలకొల్లు నుంచి పోటీ చేయలేకపోయాను. ప్రస్తుతానికి పాలిటిక్స్‌లోకి వెళ్లే ఆలోచన లేదు. కానీ అవకాశం వస్తే ఈ సారి తప్పుకుండా అసెంబ్లీకి పోటీ చేస్తాను. దీనిపై ఇప్పటికిప్పుడే వివరాలు చెప్పలేను అని సురేష్ కొండేటి చెప్పారు.


Click it and Unblock the Notifications











