RRR: రామ్ చరణ్ ను మొదటిసారి చూసింది అక్కడే.. ఆ ఆటతో క్లోజ్ అయ్యాం: Jr ఎన్టీఆర్

భారీ అంచనాలతో విడుదలవుతున్న RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో ఎవరి ఊహకు కూడా అందడం లేదు. మొదటిరోజు అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అందరిలో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఈజీగా ఫస్ట్ డే వంద కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది అని చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కష్టపడుతున్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాడు.

మెగా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

మెగా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

RRR సినిమా రాబోతోంది అనగానే మెగా నందమూరి ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మెగా నందమూరి హీరోలకు ఏ మాత్రం స్నేహం ఉండదు అని వారి కుటుంబాల మధ్య చాలా బేధాభిప్రాయాలు ఉన్నాయి అని అప్పట్లో చాలా రకాల కథనాలు వినిపించాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఎప్పుడైతే కలిసి సినిమా చేశారో అప్పటినుంచి అభిమానులలో ఒక సరి కొత్త ఉత్సాహం కనిపిస్తోంది అని చెప్పాలి. ఒక విధంగా రెండు వర్గాల అభిమానుల మధ్య మంచి స్నేహం ఏర్పడింది అనే చెప్పాలి.

బాక్సాఫీస్ కుంభస్థలాన్ని కొట్టేలా..

బాక్సాఫీస్ కుంభస్థలాన్ని కొట్టేలా..

ఇండస్ట్రీలో అసలు మల్టీస్టారర్ సినిమాలు అనేవి మాయం అవుతున్న తరుణంలో దర్శకుడు రాజమౌళి మెగా నందమూరి హీరోలను ఓకే వెండి తెరపై చూపించడం పెద్ద ప్రయోగమనే చెప్పాలి. రామ్ చరణ్ తేజ్ ను అల్లూరి సీతారామ రాజుగా జూనియర్ ఎన్టీఆర్ ను కొమురంభీం పాత్రలో చూపించబోతున్న రాజమౌళి బాక్సాఫీస్ కుంభస్థలాన్ని గట్టిగానే కొట్టబోతున్నట్లు అర్థమయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూ

అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూ


ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి తో రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అద్భుతంగా ఉంది. ఇక ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఆఫ్ స్క్రీన్ లో హీరోలు ఎలా ఉన్నారు.. అనే విషయాలపై కూడా ఆరా తీశాడు.

మొదటిసారి..

మొదటిసారి..

మొదటిసారి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కలుసుకున్నారు అనే విషయంపై కూడా ప్రశ్నించగా అందుకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు. మేము ఇద్దరం చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్నాము కానీ ఆ విషయం బయటకు తెలియదు. ఎప్పుడు కూడా మేము అలా బయటకి కనిపించాలని అనుకోలేదు. కానీరెగ్యులర్ గా కలుసుకునేందుకు ఇష్టపడినట్లు ఎన్టీఆర్ చెప్పాడు.

 క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ..

క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ..

అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందరూ హీరోలు క్రికెట్ ఆడే సమయంలో కలుసుకున్నాము అంటూ అప్పుడు రామ్ చరణ్ తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది అని ఇద్దరు కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం అని తారక్ అన్నాడు. ఇక ఆ తర్వాత ఒకరికొకరం పూర్తిగా అర్థమైన అనంతరం తమ ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది అని కూడా జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

RRR: India's Biggest Pre Release Event At Chikkaballapura | NTR | SS Rajamouli | Filmibeat Telugu
లోపల అగ్నిపర్వతం ఉన్నాసరే..

లోపల అగ్నిపర్వతం ఉన్నాసరే..

రామ్ చరణ్ లో తనకు బాగా నచ్చేది చాలా సైలెంట్, కామ్ గా ఉంటాడు అని అవసరమైతే తప్ప ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాడు అని తేల్చి చెప్పేశాడు. అంతేకాకుండా రామ్ చరణ్ లోపల అగ్నిపర్వతం ఉన్నాసరే పైకి అదే చిరునవ్వుతో కనిపిస్తాడు అని అతను చాలా ఫ్రెండ్లిగా ఉంటాడు అని కూడా ఎన్టీఆర్ తన స్నేహితుడు గురించి గొప్పగా చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X