RRR Press Meet: సినిమాలో నా ముందు టైగర్ లా గర్జించింది ఆయనే.. భయపడలేదు: Jr ఎన్టీఆర్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత బిగ్ బడ్జెట్ సినిమాల హడావుడి మొదలయ్యింది. అందరికంటే ముందుగా RRR సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ తో బిజీగా కనిపిస్తోంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల వివిధ భాషల్లోనూ ప్రెస్ మీట్స్ లకు హాజరవుతున్నారు. ఇక నేడు తెలుగు మీడియా ముందుకు వచ్చి అనేక రకాల సందేహాలకు జవాబులు ఇచ్చారు. అయితే సినిమాలో కొమరం భీమ్ మొహం వద్దకు వచ్చిన టైగర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక వివరణ ఇచ్చాడు. గ్రాఫిక్స్ కంటే ముందు టైగర్ గా కనిపించింది ఎవరనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.

అంచనాలకు తగ్గట్టుగా సమానంగా..
ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ ఒక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక తప్పకుండా ఈ రెండు పాత్రలు కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సమానంగా ఉంటాయని ఇప్పటికే టీజర్ ట్రైలర్స్ తో క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలను చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్ మీట్ లో తెలియజేస్తున్నారు.

అభిమానుల కారణంగా
ఇటీవల తమిళ్ బాలీవుడ్ కన్నడ ఇండస్ట్రీలలో వరుసగా ప్రెస్ మీట్ నిర్వహించిన రాజమౌళి యూనియ్ తెలుగు మీడియా ముందుకు వచ్చింది. అసలైతే శుక్రవారం రోజున తెలుగు ప్రెస్ మీట్ ను పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ అభిమానుల హడావుడి ఎక్కువ కావడంతో మళ్ళీ వాయిదా వేయక తప్పలేదు. మిగతా భాషల్లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు అభిమానుల తాకిడికి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.

టైగర్ కు మీరు భయపడ్డారా?
ఇక నేడు తెలుగు మీడియా ముందుకు వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు వారి అనుభవాలను పంచుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కనిపించిన టైగర్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పడం విశేషం. సినిమాలో కనిపించిన టైగర్ కు మీరు భయపడ్డారా లేకపోతే రాజమౌళి మిమ్మల్ని భయపెట్టారా ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

పులిలా అరిచింది ఆయనే..
ఆ సీన్లలో కనిపించినా టైగర్ రాజమౌళి గారి అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు. లైవ్ లోకేషన్ లో అలా గర్జిస్తూ ముందుకు వచ్చింది రాజమౌళి గారి అంటూ ఇక తెలిసిన పులి కాబట్టి నేను కూడా ఒక అరుపు అరిచాను అని తారక్ నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు. గ్రాఫిక్స్ లో టైగర్ ను క్రియేట్ చేసే కంటే ముందే లైవ్ లొకేషన్ లో పులి లాగా అరిచింది రాజమౌళి గారు అని జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు.

టైగర్ ఇంట్రెస్టింగ్ సీన్స్
ఇక RRR సినిమా లో టైగర్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి టైగర్ ఫైట్ తోనే ఎంట్రీ ఇస్తాడట. ఇక ఆ తర్వాత దాన్ని స్నేహంగా మార్చుకుని కూడా బ్రిటిష్ వారిపై యుద్ధానికి ఉసిగొల్పుతాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి నిర్మాతల చేత భారీగా ఖర్చు చేయించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











