Adhurs: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.. మరికొద్ది రోజుల్లోనే ఆ సినిమా రిలీజ్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పాత సినిమాల స్పెషల్ షోలు, రీ రిలీజ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు 4K ప్రింట్లతో ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటన్నింటికీ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ నుంచే కాకుండా సామాన్య సినీ ప్రియుల నుంచి కూడా ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు కూడా చాలా చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. తాజాగా అతడి అభిమానులు పండుగ చేసుకునే ప్రకటన వెలువడింది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, ఇందులో అతడు చేసిన చారి అనే పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలను వేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని మార్చి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లొకేషన్లలో ప్రదర్శించబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా మొదలు కాబోతుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన 'అదుర్స్' మూవీని ఎన్టీఆర్ నటించాడు. ఇందులో అతడు రెండు రోల్స్ చేశాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార, షీలా నటించారు. బ్రహ్మానందం అదిరిపోయే పాత్రను చేశారు. దీనికి వల్లభనేని వంశీ నిర్మాతగా వ్యవహరించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. అంతేకాదు, ఏకంగా 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అయితే, అప్పట్లో ఉద్యమం కారణంగా దీనికి చిక్కులు కూడా వచ్చాయి.
ఇక, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఫిబ్రవరి నెలలో, రెగ్యూలర్ షూటింగ్ మార్చి నెల నుంచి ప్రారంభం అవుతుందని 'అమిగోస్' ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











