ఎన్టీఆర్ హార్ట్ బ్రేక్.. ఓ దేవుడా నువ్వు ఏం చేస్తున్నావ్? అంటూ అనసూయ ఆవేదన!

ఒక షాక్ నుంచి కొలుకోక ముందే బాలీవుడ్ జనాలను మరొక సీనియర్ నటుడి మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త మారువకముందే రిషి కపూర్ కూడా మరణించినట్లు తెలియడంతో సినీ ప్రముఖులు మనోవేదనకు లోనవుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోవడం ఎంతో బాధను కలిగిస్తోంది. కనీసం కడసారి చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది.

షాకింగ్ న్యూస్..

షాకింగ్ న్యూస్..

గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ హఠాత్తుగా మరణించడం బాలీవుడ్ జనాలను షాక్ కి గురి చేసింది. ఆయన ఆరోగ్యం కొలుకుంటున్నట్లు కొన్ని గంటల ముందు చెప్పిన కపూర్ కుటుంబ సభ్యులు ఇంతలోనే ఆయన మరణించినట్లు చెప్పడం ఆశ్చర్యనికి గురి చేస్తోంది. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ సీనియర్ యాక్టర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తారక్ హార్ట్ బ్రేక్..

"నిజంగా హార్ట్ బ్రేక్ అయ్యింది.. నిన్న అద్భుతమైన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ గారిని కోల్పోయాము. ఇక ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ సాబ్ కూడా మన నుంచి దూరమయ్యారు. సినిమా ఇండస్ట్రీకి ఇది దారుణమైన దెబ్బ.. మంచి నటులను కోల్పోయాము" అని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

ఓ దేవుడా నువ్వు ఏం చేస్తున్నావ్..

రిషి కపుర్ మృతిపై జబర్దస్త్ యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. "ఓ దేవుడా మీరు మాకు ఏం చేస్తున్నారు. భారతీయ సినిమా నుండి ఇలాంటి రత్నాలను తీసివేస్తున్నారు. ఈ భయంకరమైన వార్తతో ఈ రోజు మేల్కొన్నాను. తరతరాలుగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రిషి కపూర్ ఇక లేరు.. ఇలాంటి సమయంలో నీతు కపూర్ గారు బలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని అనసూయ పేర్కోన్నారు.

Recommended Video

#RishiKapoor : Celebrities And Politicians Pay Tribute To Rishi Kapoor
హీరోయిన్స్ సంతాపం..

హీరోయిన్స్ సంతాపం..

రిష్ కపూర్ అందరికి నచ్చిన నటుడు కావడంతో సినిమా ఇండస్ట్రీలో ఆయనను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న నేటితరం హీరోయిన్స్ కూడా వారి బాధను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. తమన్నా భాటియా, తాప్సి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటీమణులు రిషి కపూర్ మృతిపట్ల ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X