Devara: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న 'దేవర' థర్డ్ సింగిల్.. ఆ రొమాంటిక్ పోస్టర్ పిచ్చెక్కిస్తుందిగా..!
'దేవర'పోస్టర్స్ అండ్ గ్లింప్స్ విడుదల చేస్తూ ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మూవీ మేకర్స్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ, అప్పటి కలల యూత్ కలల రాణి అతిలోకసుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ అమ్మడు తెలుగులో వస్తున్న తొలి మూవీ ఇదేనని చెప్పుకోవచ్చు. ఈ బ్యూటీ గ్లామర్ షో చూస్తే.. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టేలా కనిపిస్తుంది.
ఆకట్టుకుంటోన్న గ్లింప్స్ అండ్ పోస్టర్స్
గత నెల నుంచి దేవర నుంచి విడుదలయ్యే గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా యుంగ్ దేవరలోని రొమాంటిక్ సాంగ్స్‌కు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల రిలీజైన రొమాంటిక్ పాటలపై అమ్మాయిలు తెగ రీల్స్ చేస్తున్నారు. అంతగా ఆకట్టుకుంటుంది మరీ తారక్-జాన్వీ జోడి. ఇకపోతే ఈ మూవీ సెప్టెంబరు 27 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. దీంతో ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రొమాంటిక్ పోస్టర్
ఇకపోతే తాజాగా ఈ చిత్రంలోని థర్డ్ సాంగ్ తేదీ ఖరారు అయింది. సెప్టెంబరు 4 వ తారీకున చిత్ర బృందం విడుదల చేయనున్నారు. అంటే మరో రెండు రోజులు మాత్రమే ఉంది. దావుడి అంటూ ఈ సాంగ్ సాగుతుంది. ప్రతీ బీట్ కూడా వావ్ అనిపిస్తుందని దేవర బృందం తెలిపింది. ఈ సందర్భంగా మూడో పాటకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ తారక్ ఔట్ ఫిట్‌లో కనిపించగా.. వైట్ కలర్ డ్రెస్‌లో జాన్వీ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ పిక్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పోస్టర్‌లో రొమాంటిక్ స్టెప్ అదిరిపోయింది. ఇక సాంగ్ మొత్తం ఎలా ఉండబోతుందంటూ అభిమానులు ఈగర్ కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటి వరకు హిట్టు కొట్టలేదనే టాక్ ఉంది. మరీ ఆ సెంటిమెంట్ ను తారక్ దేవరతో బ్రేక్ చేస్తాడని లేదా వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











