Devara: హీరోయిన్‌తో గోవాలో ఎన్టీఆర్.. అప్పటి వరకూ అక్కడేనట

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి అడుగు పెట్టినా.. ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని భారీ రేంజ్‌కు ఎదిగిపోయాడు. మధ్యలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. ఈ మధ్య కాలంలో మాత్రం తారక్ విజయాల పరంపరతో సత్తా చాటుతున్నాడు. అంతేకాదు, రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీతో ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించాడు. ఫలితంగా క్రేజ్ రెట్టింపు చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు.

Jr NTR and Janhvi Kapoor Went Goa for Devara Movie Shoot

కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో భారీ యాక్షన్‌తో రాబోతున్న 'దేవర' మూవీని బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన ఎన్నో భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా కోసం 60 శాతం పైగానే టాకీ పార్టును సైతం ఫినీష్ చేసేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా జరపాలని యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

Jr NTR and Janhvi Kapoor Went Goa for Devara Movie Shoot

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీ షూటింగ్‌ను ఇప్పుడు గోవాలో ప్లాన్ చేశారు. అక్కడ ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. అంతేకాదు, ఈ జోడీపై ఓ సాంగ్‌ను సైతం చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది. దాదాపు ఈ షెడ్యూల్ వారం రోజుల వరకూ జరుగుతుందని అంటున్నారు. అది అయిన వెంటనే హైదరాబాద్‌ వచ్చి మరో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఇదే వేగంతో షూట్ పూర్తి చేసి సినిమాను నవంబర్ చివరి నాటికి పూర్తి చేయనున్నారని సమాచారం.

Jr NTR and Janhvi Kapoor Went Goa for Devara Movie Shoot

ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అందులో మొదటి పార్టును 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X